HomeMovie News Teluguఘనంగా విశాల్‌ నిశ్చితార్ధం.!

ఘనంగా విశాల్‌ నిశ్చితార్ధం.!

తమిళ హీరో విశాల్‌ వివాహ నిశ్చితార్ధం నేడు హైద్రాబాద్‌లో ఓ స్టార్‌ హోటల్‌లో ఘనంగా జరిగింది. ఈ నిశ్చితార్ధ వేడుకకు తమిళ నడిగర్‌ సంఘానికి చెందిన పలువురు ప్రముఖులు అతిధులుగా విచ్చేశారు. అయితే టాలీవుడ్‌ ప్రముఖులెవరూ ఈ వేడుకకు హాజరు కాలేదనీ సమాచారమ్‌. హైద్రాబాద్‌కి చెందిన అనీశాను విశాల్‌ గత కొంతకాలంగా ప్రేమిస్తున్న సంగతి తెలిసిందే.

ఇటీవల ఓ సందర్భంలో అనీశాతో ప్రేమ సంగతిని సోషల్‌ మీడియా ద్వారా ఫ్యాన్స్‌తో పంచుకున్నారు విశాల్‌. ఇరు కుటుంబాల పెద్దల అంగీకారం దక్కింది వీరి ప్రేమకు. ఇటీవల విశాల్‌ తండ్రి తన కుమారుడి వివాహం త్వరలో జరగనుందని మీడియా ముఖంగా పేర్కొన్నారు. ఈ క్రమంలో నేడు ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్న ఈ ప్రేమ జంట సెప్టెంబర్‌లో పెళ్లి పీటలెక్కనుందని సమాచారమ్‌. ప్రస్తుతం విశాల్‌ ‘టెంపర్‌’ రీమేక్‌ ‘అయోగ్య’లో నటిస్తున్నారు. నటుడిగానే కాకుండా, నిర్మాతగా, నడిగర్‌ సంఘం అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్న విశాల్‌ నడిగర్‌ సంఘం భవన నిర్మాణం పూర్తయ్యేంతవరకూ పెళ్లి చేసుకోనని గతంలో చెప్పారు.

ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న నడిగర్‌ సంఘం భవన నిర్మాణం త్వరలోనే పూర్తి కానుంది. అంటే విశాల్‌ వివాహం కూడా అతి త్వరలోనే జరగనుందన్న మాట. 

You May Like This
- Advertisment -spot_img

Most Popular