HomeMovie News Teluguఆలియాభట్‌ రికార్డు సృష్టించింది.!

ఆలియాభట్‌ రికార్డు సృష్టించింది.!

బాలీవుడ్‌ క్యూట్‌ బ్యూటీ ఆలియాభట్‌ త్వరలో తెలుగులో ఎంట్రీ ఇవ్వబోతోంది. ప్రతిష్ఠాత్మక చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ద్వారా ఈ ముద్దుగుమ్మ తెలుగు తెరకు పరిచయం కాబోతోంది. అయితే తెలుగులో ఎంట్రీ ఇచ్చేందుకు ఆలియాభట్‌ భారీ రెమ్యునరేషన్‌ అందుకుంటోందట. ఇంతవరకూ సౌత్‌లో ఏ హీరోయిన్‌ అందుకోని ఫిగర్‌ అనీ తెలుస్తోంది. గతంలో పలువురు బాలీవుడ్‌ ముద్దుగుమ్మలు సౌత్‌లోకి ఎంట్రీ ఇచ్చారు కానీ, ఈ స్థాయిలో రెమ్యునరేషన్‌ తీసుకున్నది మాత్రం ఆలియానేనట. 

వాస్తవానికి ఆలియా టాలీవుడ్‌ ఎంట్రీ విషయంలో గతంలో నుండీ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అవన్నీ వట్టి గాసిప్స్‌ అని కొట్టిపాడేశారు. కానీ అది నిజమేనని తేలిపోయిందిప్పుడు. ఇంతవరకూ రెమ్యునరేషన్‌ విషయంలోనే ఆలియాతో సీరియస్‌ చర్చలు జరిగాయట. చివరికి ఆమె అడిగినంత రెమ్యునరేషన్‌ ఇచ్చి నిర్మాత దానయ్య అలియానే ఏరి కోరి తీసుకున్నారట. 

ఇకపోతే హీరోలు చరణ్‌ కావచ్చు, ఎన్టీఆర్‌ కావచ్చు రెమ్యునరేషన్‌ పరంగా తమ గత చిత్రాలతో పోల్చితే ఒక మెట్టు పైనే ఉన్నారనీ తెలుస్తోంది. ఏది ఏమైనా ఖర్చు విషయంలో నిర్మాత అస్సలేమాత్రం రాజీపడడం లేదు. బడ్జెట్‌ ఇంతా.. అని ఆయన ఎంతో కాన్ఫిడెంట్‌గా ముందే చెప్పేయడం విశేషం. ఇక ‘ఆర్‌ఆర్‌ఆర్‌‘లో మరో హీరోయిన్‌గా విదేశీ భామ డైసీ ఎడ్గార్‌ జోన్స్‌ను ఎన్టీఆర్‌కి జోడీగా ఎంచుకున్న సంగతి తెలిసిందే.

You May Like This
- Advertisment -spot_img

Most Popular