HomeMovie News Teluguఫ్యాన్స్‌ని డిజప్పాయింట్‌ చేసిన ఎన్టీఆర్‌.!

ఫ్యాన్స్‌ని డిజప్పాయింట్‌ చేసిన ఎన్టీఆర్‌.!

‘అరవింద సమేత’ తర్వాత ఎన్టీఆర్‌ ‘ఆర్‌ఆర్‌ఆర్‌‘ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న టాలీవుడ్‌ బిగ్‌ మల్టీస్టారర్‌ చిత్రమిది. ఇక్కడిదాకా బాగానే ఉంది. ఈ సినిమా కోసం ఎన్టీఆర్‌ అంత కష్టపడిపోతున్నాడు. ఇంత కష్టపడిపోతున్నాడు అనే మాటలు వినిపిస్తున్నాయి. కానీ ఆ కష్టం ఎక్కడా ఎన్టీఆర్‌ లుక్స్‌లో కనిపించడం లేదే.? లుక్స్‌ విషయంలో ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ చాలా డిజప్పాయింట్‌మెంట్‌లో ఉన్నారు. 

ఈ మధ్య ఇతరత్రా సినిమా ఆడియో ఫంక్షన్స్‌లో ఎన్టీఆర్‌ తరచూ కనిపిస్తున్నారు. అయితే లుక్స్‌లో మాత్రం ఎలాంటి ఛేంజ్‌ కనిపించడం లేదు. బాగా బరువు పెరిగిపోయాడు. గుబురు గెడ్డంతో హ్యాండ్‌సమ్‌ లుక్స్‌కి దూరమైపోయాడు. ఇంతగా పెరిగిన బరువును ఎన్టీఆర్‌ ఇంకెప్పటికి తగ్గించుకుంటాడు.? అసలు ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ షూటింగ్‌లో ఎన్టీఆర్‌ పాల్గొంటున్నాడా.? ఒకవేళ షూటింగ్‌లో పాల్గొంటే ఎన్టీఆర్‌ ఇదే లుక్స్‌తో సినిమాలో కనిపిస్తాడా.? ఇలాగే స్క్రీన్‌పై కనిపిస్తే ఎన్టీఆర్‌ని తట్టుకోవడం కష్టమే.. అనే అనుమానాలు ఫ్యాన్స్‌లో మెదులుతున్నాయి. 

మరి ఎన్టీఆర్‌ ఎందుకు తన ఫిజిక్‌పై కాన్‌సన్‌ట్రేట్ చేయడం లేదు. అసలింతకీ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో ఎన్టీఆర్‌ క్యారెక్టర్‌ ఎలా ఉండబోతోందో.? అనే ప్రశ్నలు ఫ్యాన్స్‌లో ఉత్కంఠ కలిగిస్తున్నాయి. మరోవైపు రామ్ చరణ్‌ని తీసుకుంటే, ‘వీవీఆర్‌’ కోసం  పిట్‌నెస్‌ పరంగా చరణ్‌ చాలా కష్టపడ్డాడు. అదే ఫిట్‌నెస్‌ని ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లోనూ కంటిన్యూ చేయనున్నాడు చరణ్‌. సో చరణ్‌ విషయంలో నో ప్రాబ్లెమ్‌. మరి ఎన్టీఆర్‌ ఎందుకిలా.? ఆన్సర్‌ దొరికేదెలా.? లెట్స్‌ వెయిట్‌ అండ్‌ సీ.!

You May Like This
- Advertisment -spot_img

Most Popular