HomeMovie News Teluguజై తెలుగుదేశం... జై చంద్ర‌బాబు

జై తెలుగుదేశం… జై చంద్ర‌బాబు

ప్ర‌ముఖ హాస్య‌న‌టుడు అలీ.. చాలారోజుల నుంచీ మూడు కుర్చీలాట ఆడుతున్నాడు. జ‌న‌సేన‌, టీడీపీ, వైకాపాల‌లో దేనిలో చేరాలో తెలియ‌క స‌త‌మ‌త‌మ‌వుతున్నాడు. ప‌వ‌న్ – అలీ మంచి మిత్రులు. మ‌రోవైపు అలీ జ‌గ‌న్ తోనూ ట‌చ్‌లో ఉన్నాడు. చంద్ర‌బాబునాయుడుని ఈమ‌ధ్య క‌లిసి వ‌చ్చాడు అలీ. దాంతో అలీ మ‌న‌సులో ఏముందో తేల్చుకోలేక‌పోతున్నాయి రాజ‌కీయ వ‌ర్గాలు. 

చివ‌రికి టీడీపీలో అడుగుపెట్ట‌డం ఖాయ‌మైంద‌ని స‌మాచారం. అలీ న‌టుడిగా 40 సంవ‌త్స‌రాలు పూర్తి చేసుకోవ‌డంతో విజ‌య‌వాడ‌లో ఓ స‌న్మాన కార్య‌క్ర‌మం జ‌రిగింది. దీనికి చంద్ర‌బాబు నాయుడు అతిథిగా హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా అలీని టీడీపీలోకి ఆహ్వానించారు. ఈ ఘ‌డియ కోస‌మే అలీ చాలా కాలం నుంచి ఎదురుచూస్తున్నాడు. 

త‌నంత‌ట తాను పార్టీలోకి వెళ్ల‌డం కంటే, ఎవ‌రు ఆహ్వానిస్తే ఆ పార్టీలోకి వెళ్ల‌డం మంచిద‌న్న‌ది అలీ ఉద్దేశం. అందుకే చంద్ర‌బాబుని కావాల‌ని ఈ ఫంక్ష‌న్‌కి పిలిచాడు అలీ. ఆయ‌న రావ‌డం, పార్టీలోకి ఆహ్వానించ‌డం జ‌రిగిపోయాయి. అలీ డిమాండ్ చేస్తున్న గుంటూరు (తూర్పు) టికెట్ ఇవ్వ‌డానికి సైతం చంద్ర‌బాబు నాయుడు ఓకే చెప్పార‌ని తెలుస్తోంది. సో.. అతి త్వ‌ర‌లో `జై తెలుగుదేశం, జై చంద్ర‌బాబు` అంటూ సైకిల్ ఎక్కేయ‌డం ఖాయం. 

You May Like This
- Advertisment -spot_img

Most Popular