HomeMovie News Teluguబూతు ఫోటోలతో శ్రీరెడ్డి నీతులు.!

బూతు ఫోటోలతో శ్రీరెడ్డి నీతులు.!

కాస్టింగ్‌కౌచ్‌ వివాదం తర్వాత నటి శ్రీరెడ్డి ఈ మధ్య లారెన్స్‌తో ఓ సినిమా అనీ, తమిళంలో ఇంకో సినిమా అని మాటలు చెప్పింది. చెన్నై చెక్కేసింది. ఇప్పుడు చెన్నైలో సినిమా అయిపోయినట్లుంది. శ్రీరెడ్డి మళ్లీ సోషల్‌ మీడియా వేదికగా చెలరేగిపోతోంది. పవన్‌ కళ్యాణ్‌ మీద విమర్శలు మామూలే. తాజాగా అసభ్యకరమైన పోస్టులు చేస్తోంది. పైగా వాటితో నీతులు చెబుతోంది.

‘చేసేది ఇంకేదో.. కానీ చెప్పేవేమో శ్రీరంగనీతులు..’ అనే సామెత శ్రీరెడ్డికి కరెక్ట్‌గా సూటవుతుంది. ‘కొందరి ఒత్తిడి, కొందరి కామం..’ అంటూ ఓ డైలాగ్‌ పేలుస్తూ శ్రీరెడ్డి ఓ ఫోటో పోస్ట్‌ చేసింది. ఇంకో ఫోటోకేమో, మేము ప్రేక్షకుల్ని రంజింపచేయడానికే ఎక్స్‌పోజింగ్‌ చేస్తాం. కానీ నిర్మాతలు, వాళ్ల కొడుకులు ఎందుకు అడ్వాంటేజ్‌ తీసుకుంటారు.? అని ప్రశ్నిస్తూ మరో అసభ్యకరమైన ఫోటో ఒకటి పోస్ట్‌ చేసింది. 

ఖాళీగా ఉంటే శ్రీరెడ్డి ఊరికే అస్సలుండదు. సోషల్‌ మీడియాని బేస్‌ చేసుకుని తన నోటి దురదను తీర్చుకుంటూ ఉంటుంది. ఎప్పుడో ఆమెని పట్టించుకోవడం మానేశారు. అయినా గుర్తొచ్చినప్పుడల్లా ఏదో ఒక రకంగా దుమారం లేపుతూనే ఉంటుంది. ఇప్పటికి ఇలా మొదలైన శ్రీరెడ్డి ‘ఛీ’ దుమారం ముందు ముందు ఇంకెంత దూరం వెళ్తుందో చూడాలి మరి.

You May Like This
- Advertisment -spot_img

Most Popular