HomeMovie News Teluguసీనియర్‌ స్టార్స్‌ అలా యంగ్‌స్టర్స్‌ ఇలా.!

సీనియర్‌ స్టార్స్‌ అలా యంగ్‌స్టర్స్‌ ఇలా.!

టాలీవుడ్‌లో ఓ వైపు సీనియర్‌ హీరోలకు హీరోయిన్లు కరువవుతుంటే, జూనియర్‌ హీరోలు మాత్రం ఒకరు కాదు ఇద్దరు కాదు, ముగ్గురు నలుగురు ముద్దుగుమ్మలతో ఆన్‌ స్క్రీన్‌ రొమాన్స్‌కి సిద్ధమవుతున్నారు. ‘ఎఫ్‌ 2’లో విక్టరీ వెంకటేష్‌కి జోడీ కోసం వెతికి వెతికి చివరికి తమన్నాని ఫిక్స్‌ చేశారు. తమన్నా – వెంకీ జోడీ విషయంలో మొదట్లో అనుమానాలొచ్చినా, సినిమా హిట్‌ అవ్వడంతో కొట్టుకెళ్లిపోయింది. ఇక తదుపరి వెంకీ నటిస్తున్న ‘వెంకీ మామ’ శ్రియను ఎంచుకున్న సంగతి తెలిసిందే. 

ఇక చిరంజీవి, నాగార్జున, బాలయ్యల సరసన హీరోయిన్లుగా ఎవరిని తీసుకోవాలనే ఆలోచన దర్శక, నిర్మాతలకు కాస్త కష్టంగానే మారింది. ఇదిలా ఉంటే, మరోవైపు యంగ్‌ హీరోలు విజయ్‌ దేవరకొండ, నాని, రామ్‌ తదితరులు ఇద్దరు నుండి ముగ్గురు, నలుగురు హీరోయిన్స్‌ వరకూ తమ సినిమాల్లో రొమాన్స్‌ పండించేందుకు సిద్ధమవుతుండడం విశేషం. విజయ్‌ దేవరకొండ, క్రాంతి మాధవ్‌ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా కోసం ఏకంగా నలుగురు ముద్దుగుమ్మల్ని లైన్‌లో పెట్టేశాడు. 

ఇక నేచురల్‌ స్టార్‌ నాని, విక్రమ్‌ కుమార్‌ సినిమాలోనూ నలుగురు భామలు సందడి చేయబోతున్నారు. అలాగే ఎనర్జిటిక్‌ హీరో రామ్‌ – పూరీ కాంబినేషన్‌ కోసం ఇద్దరు భామలు ఆల్రెడీ ఎంపికయ్యారు. ఐటెం సాంగ్‌ కోసం మరో భామ పేరు కూడా పరిశీలనలో ఉందట. ఇలా యంగ్‌స్టర్స్‌ హీరోయిన్స్‌ విషయంలో దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఇక సీనియర్స్‌కి మాత్రం వేళ్లలో లెక్కపెట్టేలానే ఉంది ముద్దుగుమ్మల లిస్ట్‌. ఇందులోంచే ఎవరో ఒకర్ని ఎంచుకోవడం తప్ప. లాభం లేదంతే.!

You May Like This
- Advertisment -spot_img

Most Popular