HomeMovie News Teluguర‌వికి పెళ్ల‌య్యిందా? మ‌రి ఈ నిజం ఎందుకు దాచాడు?

ర‌వికి పెళ్ల‌య్యిందా? మ‌రి ఈ నిజం ఎందుకు దాచాడు?

యాంక‌ర్ ర‌వి..  ఈటీవీలో కామెడీ షోలు చూసేవాళ్ల‌కు ఈ పేరు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం చేయ‌న‌వ‌సరం లేదు. ఈమ‌ధ్యే హీరోగా ఓ సినిమా చేశాడు. కానీ స‌క్సెస్ కాలేదు. ర‌వి ఆదివారం ఫేస్ బుక్‌లో ఓ పోస్ట్ పెట్టాడు. అది ర‌వి గురించి ఇప్ప‌టి వ‌ర‌కూ తెలియ‌ని నిజం బ‌య‌ట‌కు తెలిసేలా చేసింది. 

“విజయవంతమైన మనిషి కంటే పెళ్లైన మనిషి చాలా సంతోషంగా వుంటాడు” – అంటూ త‌ను ఓ కామెంట్ పెట్టి, ఫ్యామిలీ ఫొటో కూడా పోస్ట్ చేశాడు. తనకు పెళ్లైందని, మూడేళ్ల పాప వుందని ఇన్నాళ్లూ రహస్యంగా దాచిన నిజాన్ని బయటపెట్టాడు. గ‌తంలో యాంక‌ర్ లాస్య‌కీ, ర‌వికీ మ‌ధ్య ఎఫైర్ ఉంద‌ని గ‌ట్టిగా ప్ర‌చారం జ‌రిగింది. ఇద్ద‌రూ పెళ్లి చేసుకుంటార‌ని కూడా చెప్పుకున్నారు. కానీ లాస్య మ‌రొక‌రిని పెళ్లి చేసుకుని షాక్ ఇచ్చింది.  

అదేంటి? అలా ఎందుకు చేశారు? అని అడిగితే… ‘ర‌వికి ఇది వ‌ర‌కే పెళ్ల‌య్యింది’ అని అప్ప‌ట్లోనే చెప్పేసింది లాస్య‌. ఇదే విష‌యాన్ని ఓ ఇంట‌ర్వ్యూలో ప్ర‌స్తావిస్తే ‘నాకు పెళ్లి కాలేదు’ అని అబద్ధాలు ఆడేశాడు ర‌వి. అప్ప‌ట్లో ర‌వి మాట‌ల్ని జ‌నం కూడా న‌మ్మారు. ఇప్పుడు స‌డ‌న్‌గా త‌న భార్య‌, బిడ్డ‌ల ఫొటోతో దర్శ‌న‌మిచ్చేశాడు. అంటే ఇంత‌కాలం.. త‌నకు పెళ్లి కాలేద‌ని మాయ మాట‌లు చెప్పాడ‌న్న‌మాట‌. మ‌రి ఇప్పుడే ఈ విష‌యాన్ని ఎందుకు బ‌య‌ట‌పెట్టాడో మ‌రి..??

You May Like This
- Advertisment -spot_img

Most Popular