HomeMovie News Teluguవ‌సూళ్ల ప‌రంగా టాప్ 10 తెలుగు చిత్రాలివే!

వ‌సూళ్ల ప‌రంగా టాప్ 10 తెలుగు చిత్రాలివే!

ఈ సంక్రాంతికి వ‌చ్చిన ‘ఎఫ్ 2’. రోజు రోజుకీ వ‌సూళ్లు దండిగా అందుకుంటూ కొత్త రికార్డులు సృష్టిస్తోంది. గ‌త వారాంతంలో టాలీవుడ్ టాప్ 15 చిత్రాల‌లో ఒక‌టిగా నిలిచిన ఎఫ్ 2. ఇప్పుడు టాప్ 10లో స్థానం సంపాదించుకుంది. ఇన్నేళ్ల టాలీవుడ్ ప్ర‌స్థానంలో… వ‌సూళ్ల ప‌రంగా నెంబ‌ర్ వ‌న్‌గా నిలిచిన చిత్రం ‘బాహుబ‌లి 2’ అయితే. ప‌దో స్థానంలో ‘ఎఫ్ 2’ నిలిచింది. 

అయితే…పెట్టుబ‌డి ప‌రంగా – ఎఫ్ 2 చిన్న సినిమానే. అలాంటి చిత్రానికి టాప్ 10లో స్థానం ద‌క్క‌డం ట్రేడ్ వ‌ర్గాల విశ్లేష‌కుల్ని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. చిన్న సినిమా సాధించిన పెద్ద విజ‌యంగా ఎఫ్ 2 ని అభివ‌ర్ణించొచ్చు. అస‌లు టాప్ 10 లిస్టులో ఉన్న సినిమాలేంటి?  ఏ సినిమాని ఏ నెంబ‌ర్ కేటాయించారు?  ఆ లిస్టు ఒక్క‌సారి చూస్తే…?

1. బాహుబ‌లి 2
2. బాహుబ‌లి
3. రంగ‌స్థ‌లం
4. ఖైదీ నెంబ‌ర్ 150
5. భ‌ర‌త్ అనే నేను
6. అర‌వింద స‌మేత‌
7. స‌రైనోడు
8. జ‌న‌తా గ్యారేజ్‌
9. అత్తారింటికి దారేది
10. ఎఫ్ 2

You May Like This
- Advertisment -spot_img

Most Popular