HomeMovie News Teluguరంగమ్మత్త టాటూ సీక్రెట్‌ ఇదే.!

రంగమ్మత్త టాటూ సీక్రెట్‌ ఇదే.!

బుల్లితెర జబర్దస్త్‌ అందం అనసూయ వెండితెరపై రంగమ్మత్తగా ‘రంగస్థలం’ సినిమాతో హల్‌చల్‌ చేసిన సంగతి తెలిసిందే. ఎన్ని సినిమాల్లో చేసినా, అనసూయకు రంగమ్మత్త అనే గుర్తింపు అయితే అలాగే ఉంటుందేమో. ఆ సంగతి పక్కన పెడితే, అనసూయ తన పర్సనల్‌ సీక్రెట్‌ ఒకటి బయట పెట్టింది. కాస్త జాగ్రత్తగా పరిశీలిస్తే, అనసూయ ఛాతీ భాగంలో ఓ టాటూ కనిపిస్తుంది. 

హీరోయిన్లు ఇలాంటి టాటూలు వేయించుకోవడం మామూలే. త్రిషకి కూడా అదే ప్లేస్‌లో ఓ టాటూ కనిపిస్తుంది. ఇంతకీ అనసూయ టాటూ సీక్రెట్‌ ఏంటో తెలుసా.? ఆ టాటూలో ఉన్న అక్షరాలు ‘నిక్కు’ అంటూ అనసూయ భర్త పేరును తెలియజేస్తాయట. అనసూయ తన భర్తని ‘నిక్కు’ అని పిలుచుకుంటుందట. ఓ అభిమాని సోషల్‌ మీడియాలో టాటూ సీక్రెట్‌ ఏంటని ప్రశ్నిస్తే, ఇలా క్లారిటీ ఇచ్చింది. 

ఇంకోపక్క అనసూయ ఈ సంక్రాంతికి ‘ఎఫ్‌ 2’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో అనసూయ గెస్ట్‌ రోల్‌లోనూ, ఓ స్పెషల్‌ సాంగ్‌లోనూ నటిస్తోంది. మరోవైపు దివంగత నేత వైఎస్సార్‌ బయోపిక్‌ ‘యాత్ర’తో ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో అనసూయది చాలా ఇంట్రెస్టింగ్‌ రోల్‌ అట. అనసూయ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న ‘కథనం’ సమ్మర్‌లో విడుదల కానుంది.

You May Like This
- Advertisment -spot_img

Most Popular