HomeMovie News Teluguలేడీ రోబోకి పెళ్లయిపోతోందోచ్‌.!

లేడీ రోబోకి పెళ్లయిపోతోందోచ్‌.!

అందాల అమీజాక్సన్‌ పెళ్లి చేసుకోబోతోంది. కొత్త సంవత్సరంలో ఈ బ్యూటీ ఎంగేజ్‌మెంట్‌ చేసుకుంది. జనవరి 1 అంటే నిన్న ఈ ముద్దుగుమ్మ ఎంగేజ్‌మెంట్‌ ఘనంగా జరిగింది. జార్జ్‌ పనాయోటో అనే బ్రిటన్‌ వ్యాపారవేత్తను అమీజాక్సన్‌ పెళ్లి చేసుకోబోతోంది. ‘నా కొత్త ప్రయాణం మొదలైంది..’ అని కొత్త సంవత్సరానికి వెల్‌కమ్‌ చెబుతూ, తన ఎంగేజ్‌మెంట్‌ విషయాన్ని ప్రస్థావించింది. తనకి కాబోయే భర్తతో రొమాంటిక్‌ యాంగిల్‌లో దిగిన ఫోటోని ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసింది. 

ఎంగేజ్‌మెంట్‌ విషయం అయితే చెప్పింది కానీ పెళ్లి విషయంలో క్లారిటీ ఇవ్వలేదు. గత కొన్నాళ్లుగా ఈ బ్యూటీ జార్జ్‌తో ప్రేమలో ఉందట. పెద్దల అంగీకారంతో ఎంగేజ్‌మెంట్‌ చేసుకుంది. అన్నట్లు అమీజాక్సన్‌ కూడా బ్రిటన్‌కి చెందిన ముద్దుగుమ్మే. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో హీరోయిన్‌గా పలు చిత్రాల్లో నటించింది. తెలుగులో మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌తో ‘ఎవడు’ సినిమాలో నటించింది. సినిమాలతో పాటు, సోషల్‌ మీడియాలో హాట్‌ పిక్స్‌తో ఎప్పటికప్పుడు యాక్టివ్‌గా ఉంటూ, ఫాలోవర్స్‌ని పెంచుకుంది. 

2018 సంవత్సరంలో ‘2.0’ సినిమాతో లేడీ రోబోగా దర్శనమిచ్చింది అమీ. తన కెరీర్‌లో ‘2.0’ ప్రత్యేకమైన చిత్రంగా అభివర్ణిస్తోంది అందాల అమీజాక్సన్‌. సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌తో స్క్రీన్‌ షేర్‌ చేసుకోవడం తన అదృష్టం అని చెప్పింది. శంకర్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా సక్సెస్‌ రేటు సంగతి అటుంచితే, విజువల్‌ వండర్‌గా సినీ ప్రముఖుల ప్రశంసల్ని అందుకుంది.

You May Like This
- Advertisment -spot_img

Most Popular