HomeMovie News Telugu'మహర్షి' స్టైలిష్‌గా వచ్చేశాడుగానీ..

‘మహర్షి’ స్టైలిష్‌గా వచ్చేశాడుగానీ..

2019లో విడుదలవుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రాల్లో ‘మహర్షి’ కూడా ఒకటి. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు హీరోగా రూపొందుతోన్న సినిమా ఇది. గతంలోనే ‘మహర్షి’ ఫస్ట్‌ లుక్‌ బయటకు వచ్చింది. తాజాగా సెకెండ్‌ లుక్‌ని విడుదల చేశారు. ఫస్ట్‌ లుక్‌ స్థాయిలోనే సెకెండ్‌ లుక్‌కి కూడా హైప్‌ క్రియేట్‌ అయ్యింది. ఫస్ట్‌ లుక్‌లో కాలేజీ కుర్రాడిలా మహేష్‌ కన్పిస్తే, సెకెండ్‌ లుక్‌లో బిజినెస్‌ మెన్‌ లుక్‌తో అదరగొట్టేశాడు. లుక్‌ పరంగా అల్టిమేట్‌ అనే చెప్పాలి. 

అయితే సినిమా నుంచి ఇంట్రెస్టింగ్‌ అప్‌ డేట్‌ ఏమీ లేకపోవడం, హీరోయిన్‌ని కూడా చూపించకపోవడంతో ఒకింత ఫ్యాన్స్‌ డిజప్పాయింట్‌ అయ్యారు. ఇదిలా వుంటే ‘భరత్‌ అనే నేను’ సినిమా తర్వాత మహేష్‌ నుంచి రానున్న సినిమా కావడంతో ‘మహర్షి’పై భారీ అంచనాలే వున్నాయి. ఈ ‘మహర్షి’ సినిమాలో మహేష్‌ పేరు రిషి అట. ఇంతకీ రిషి ఎవరు.? రిషి, మహర్షిగా ఎలా మారాడు.? అన్నది తెలియాలంటే సినిమా విడుదలయ్యేదాకా వేచి చూడాల్సిందే. 

మహేష్‌ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమా కోసం మహేష్‌ అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న సంగతి తెల్సిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌, వైజయంతీ మూవీస్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఏప్రిల్‌లో ఈ ‘మహర్షి’ ప్రేక్షకుల ముందుకు రానుంది.

You May Like This
- Advertisment -spot_img

Most Popular