HomeMovie News Telugu2018 మహానటి 'కీర్తిసురేష్‌'.!

2018 మహానటి ‘కీర్తిసురేష్‌’.!

2018 సక్సెస్‌ఫుల్‌ చిత్రాల్లో ‘మహానటి’ చెప్పుకోదగ్గది. ఈ సినిమాలో హీరోయిన్‌గా కీర్తిసురేష్‌ నటించింది. ఈ ఏడాది చాలా మంది ముద్దుగుమ్మలు హీరోయిన్లుగా పరిచయమయ్యారు. అంతకు ముందే పరిచయమైన ముద్దుగుమ్మలు పలు సినిమాల్లో నటించారు. కానీ ఏ ఒక్కరికీ దక్కని అదృష్టం ‘మహానటి’తో కీర్తిసురేష్‌కి దక్కింది. అలనాటి మేటి నటి సావిత్రి పాత్రలో నటించడమనే అవకాశం చాలా చాలా గొప్ప అవకాశం. 

ఇలాంటి అవకాశాలు హీరోయిన్స్‌కి చాలా అరుదుగా వస్తుంటాయి. ఎంతో ఎక్స్‌పీరియన్స్‌ ఉంటే తప్ప ఇలాంటి పాత్రలు పోషించే అవకాశం అస్సలు దక్కదు. కానీ కీర్తి సురేష్‌కి ఆ అవకాశం దక్కింది. ఈ పాత్రను కీర్తిసురేష్‌ ఎంచుకోవడమన్నది చాలా చాలా డేరింగ్‌ డెసిషన్‌. అరుదుగా దక్కిన ఈ అద్భుతమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంది కీర్తిసురేష్‌. విడుదలకు ముందు ఎన్ని విమర్శలు ఎదుర్కొన్నా, విడుదలయ్యాక విమర్శకుల ప్రశంసల్ని అందుకుంది. 

అందుకే ఈ ఏడాదికి ‘మహానటి’ కీర్తిసురేష్‌ అనడంలో అతిశయోక్తి ఎంత మాత్రమూ కాదు. తెలుగు, తమిళ భాషల్లో ‘మహానటి’ కీర్తి పతాకం ఎగరవేసింది. ఆ తర్వాత కీర్తిసురేష్‌ తమిళంలో వరుస సినిమాల్లో నటించింది. అగ్రహీరోలు విక్రమ్‌తో ‘సామి 2’లో, విజయ్‌తో ‘సర్కార్‌’, విశాల్‌తో ‘పందెంకోడి 2’ చిత్రాల్లో నటించి, ఈ ఏడాది మొత్తం తానే అన్నట్లుగా కనిపించింది. తమిళంతో పాటు, తెలుగులో కూడా ఈ చిత్రాలు విడుదలై మంచి పేరు తెచ్చుకున్నాయి.

You May Like This
- Advertisment -spot_img

Most Popular