HomeMovie News Telugu2018 హాటెస్ట్‌ ఆన్‌ స్క్రీన్‌ జంట.!

2018 హాటెస్ట్‌ ఆన్‌ స్క్రీన్‌ జంట.!

గతేడాది ‘అర్జున్‌రెడ్డి’ సినిమాతో లిప్‌లాక్స్‌కి పాపులారిటీ వచ్చింది. అయితే తెలుగు సినిమాకి లిప్‌లాక్‌ కొత్త కావడంతో ఈ సినిమా వివాదాలకు కేంద్రబిందువైంది. ఆ తర్వాత అలవాటైపోయింది. ఇక ఈ ఏడాడి విషయానికి వస్తే, లిప్‌లాక్స్‌తో హోరెత్తించేసిన జంటగా బాగా వాడుకలోకి వచ్చిన జంట ‘కార్తికేయ – పాయల్‌ రాజ్‌పుత్‌’. ‘ఆర్‌ఎక్స్‌ 100’ సినిమాలో ఈ జంట పండించిన ఆన్‌ స్క్రీన్‌ రొమాన్స్‌ అంతా ఇంతా కాదు. సినిమా మంచి విజయం సాధించింది.

లిప్‌లాక్‌ వీడియోలు, ఫోటోలు, పోస్టర్స్‌తో కుర్రకారుకు కిర్రెక్కించేశారు. ఈ ఏడాది ఎక్కువ మంది మాట్లాడుకున్న సినిమాల్లో ‘ఆర్ఎక్స్‌ 100’ పేరు ఖచ్చితంగా ఉంటుంది. తక్కువ బడ్జెట్‌తో ఎక్కువ లాభాలు సాధించిన సినిమా ఇది. దర్శకుడు, హీరో, హీరోయిన్‌ అంతా కొత్తవాళ్లే. అయినా గట్టి విజయం కొట్టారు. సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ శిష్యుడైన అజయ్‌ భూపతి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు. 

తొలి సినిమాకే ఎన్నో సినిమాల అనుభవం ఉన్న హీరోయిన్‌లా నటించి పాయల్‌ రాజ్‌పుత్‌ మంచి మార్కులు కొట్టేసింది. హాట్‌నెస్‌లోనూ, పర్‌ఫామెన్స్‌లోనూ కూడా సత్తా చాటింది. ఇక హీరో కార్తికేయకు మంచి క్రెడిట్‌ దక్కింది ఈ సినిమాతో. ఈ సినిమా తెచ్చిన క్రేజ్‌తో వరుసగా రెండు సినిమాలకు సైన్‌ చేశాడీ హీరో. ఆల్రెడీ ఓ సినిమా సెట్స్‌ మీదికెళ్లింది కూడా. ఇక పాయల్‌ ‘ఎన్టీఆర్‌’ బయోపిక్‌లో సహజనటి జయసుధ పాత్ర పోషించింది. సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

You May Like This
- Advertisment -spot_img

Most Popular