HomeMovie News Telugu2018 'కౌషల్‌ ఆర్మీ' సంచలనం.!

2018 ‘కౌషల్‌ ఆర్మీ’ సంచలనం.!

బుల్లితెర మెగా గేమ్‌ షో బిగ్‌బాస్‌ విజేతగా కౌషల్‌ నిలిచాడు. ఈ షోకి హోస్ట్‌గా వ్యవహరించిన నాని కన్నా కంటెస్టెంట్‌ కౌషల్‌కే ఎక్కువ క్రేజ్‌ దక్కింది. అన్ని భాషల్లోనూ బిగ్‌బాస్‌ విజేతల్లో ఇంతవరకూ ఎవరికీ రాని ఓట్లు కౌషల్‌కి దక్కాయి. అలా 2018 బిగ్‌బాస్‌ తెలుగు వెర్షన్‌ రికార్డుకెక్కింది. దీనికంతటికీ కారణం కౌషల్‌ ఆర్మీ.

కౌషల్‌ ఆర్మీ పేరుతో సోషల్‌ మీడియాని ఓ కుదుపు కుదిపేశారు. ఎవరీ కౌషల్‌ ఆర్మీ అంటూ అందరూ చర్చించుకునేలా చేశారు. హౌస్‌లో ఉన్న కౌషల్‌కి బయటి నుండి సపోర్ట్‌ చేస్తూ హౌస్‌లో ఒంటరి అయిన కౌషల్‌కి బయటి నుండి కౌషల్‌ ఆర్మీ ఇచ్చిన బూస్టప్‌ సూపర్బ్‌. 

ఏం మాయ చేసిందో, ఏం మ్యాజిక్‌ చేసిందో తెలీదు కానీ, ఈ కౌషల్‌ ఆర్మీ సోషల్‌ మీడియాలో చేసిన సందడి అంతా ఇంతా కాదు, స్టార్‌ హీరోలకు ధీటుగా కౌషల్‌కి క్రేజ్‌ దక్కించడానికి ఈ కౌషల్‌ ఆర్మీ పాత్ర అత్యంత కీలకం. కౌషల్‌ గెలుపుకు పరోక్షంగా కీలకమైన పాత్ర పోషించింది ఈ కౌషల్‌ ఆర్మీ. ప్రతీ ఒక్కరి నోటా ఈ కౌషల్‌ ఆర్మీ గురించే మాట ఆ టైంలో. అలా 2018లో బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ కౌషల్‌ కోసం సడెన్‌గా పుట్టుకొచ్చిన ఈ కౌషల్‌ ఆర్మీ సంచలనమైంది.

You May Like This
- Advertisment -spot_img

Most Popular