HomeMovie News Teluguమెగా ఇంట ఆనందాల పంట.!

మెగా ఇంట ఆనందాల పంట.!

ఈ క్రిస్మస్‌ మెగా ఫ్యామిలీకి మరింత రెట్టింపు ఆనందాన్ని పంచింది. మెగాస్టార్‌ చిన్న కూతురు శ్రీజ – కళ్యాణ్‌దేవ్‌ దంపతులకు ఈ రోజు ఆడశిశువు జన్మించింది. ఈ విషయాన్ని హీరో కళ్యాణ్‌దేవ్‌ ట్విట్టర్‌ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ‘2018 క్రిస్మస్‌ నా జీవితాంతం గుర్తుండిపోతుంది.. అభిమానులందరికీ క్రిస్మస్‌ శుభాకాంక్షలు..’ అని ట్విట్టర్‌లో పోస్ట్‌ పెట్టారు. దాంతో పాటు పాప కాలి ముద్రలను కూడా జత చేశారు.

‘విజేత’ సినిమాతో కళ్యాణ్‌దేవ్‌ హీరోగా పరిచయమయ్యాడు. ప్రస్తుతం రెండో సినిమా కోసం సన్నద్ధమవుతున్నాడు. పులివాసు దర్శకత్వంలో కళ్యాణ్‌దేవ్‌ నటిస్తున్న సినిమా స్క్రిప్టు పనులు బిజీగా నడుస్తున్నాయి. రిజ్వాన్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌లో ఈ సినిమా రూపొందుతోంది. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌ మీదికెళ్లనుంది. తొలి సినిమాతో హీరోగా మంచి మార్కులే వేయించుకున్నాడు కళ్యాణ్‌దేవ్‌.

యాక్టింగ్‌ పరంగా, డాన్సులు, ఫైట్లు పరంగా మెగా అల్లుడు అనిపించుకున్నాడు. మరి రెండో సినిమాకి పర్‌ఫామెన్స్‌లో ఎంత మేర డెవలప్‌మెంట్స్‌ చూపించనున్నాడో చూడాలిక.

You May Like This
- Advertisment -spot_img

Most Popular