HomeMovie News Teluguసంక్రాంతికి మెగా డబుల్‌ ధమాకా.!

సంక్రాంతికి మెగా డబుల్‌ ధమాకా.!

ఈ సంక్రాంతికి ఇద్దరు మెగా హీరోలు సై అంటే సై అంటూ బరిలో దిగుతున్నారు. ఒకరు చరణ్‌, మరొకరు వరుణ్‌. ఇద్దరి దారి వేరు. చరణ్‌ పవర్‌ ప్యాక్‌డ్‌ యాక్షన్‌ కంటెన్ట్‌తో వస్తున్నాడు ‘వినయ విధేయ రామ’ చిత్రంతో. కానీ వరుణ్‌ ‘ఎఫ్‌ 2’ అంటూ ఫుల్‌ ప్యాక్‌డ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌తో వస్తున్నాడు. చరణ్‌ సినిమాలో యాక్షన్‌తో పాటు మిగిలిన కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ కూడా పుష్కలంగా ఉండనున్నాయి.

బోయపాటి శీను దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా స్క్రీన్‌ నిండా కాస్టింగ్‌ ఫుల్‌ కలర్‌ఫుల్‌గా ఉండబోతోందని ఇంతవరకూ విడుదలైన పోస్టర్స్‌ ద్వారా చూపించేశారు. హాట్‌ హాట్‌ ఐటెంగా బాలీవుడ్‌ నుండి ఈషా గుప్తాని పట్టుకొచ్చారు. సో అన్ని రకాల చరణ్‌ న్యాయం చేసేలానే ఉన్నాడు. ఇక ‘ఎఫ్‌ 2’ విషయానికి వస్తే వరుణ్‌తో పాటు వెంకీ కూడా నటిస్తున్నాడు. ఫ్యామిలీ కామెడీకి వెంకీ పెట్టింది పేరు. అలాంటిది వెంకీని వయసులోనే కాదు, అనుభవంలోనూ చాలా చిన్నోడైన వరుణ్‌ మ్యాచ్‌ చేయగలడా.? లేదా.? అనే చిన్న అనుమానం ఉంది నిన్న మొన్నటిదాకా.

కానీ టీజర్‌ వచ్చాక ఆ అనుమానం పటాపంచలైపోయింది. వెంకీని ఎంత బాగా మ్యాచ్‌ చేశాడో వరుణ్‌ అంటూ మెగా ఫ్యాన్స్‌ ఆశ్చర్యపోతున్నారు. భలే ముచ్చటగా అనిపిస్తోందిలే వీరిద్దరి కాంబో. ఇలా సంక్రాంతికి మెగా హీరోలిద్దరూ కలిసి ఫుల్‌ డోస్‌ ఎంజాయ్‌మెంట్‌ ఇచ్చేందుకు రెడీ అయిపోతున్నారు ‘అంతేగా!’ మరి.

You May Like This
- Advertisment -spot_img

Most Popular