HomeMovie News Teluguపాపం ప్రియాంకకే ఎందుకిలా జరుగుతోందబ్బా.!

పాపం ప్రియాంకకే ఎందుకిలా జరుగుతోందబ్బా.!

బాలీవుడ్‌ బ్యూటీ ప్రియాంకా చోప్రా పెళ్లి ఇప్పుడు ఆమెకు పెద్ద తంటానే తీసుకొచ్చింది. ఎంతో ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్న ప్రియాంకా చోప్రాకి మీడియా నుండి వ్యతిరేకత అంతకంతకూ ఎక్కువవుతోంది. పెళ్లి ముడి పడిన నాటి నుండే ఆమెపై రకరకాల విమర్శలు గుప్పుమంటున్నాయి. అమెరికన్‌ గాయకుడు నిక్‌ని ఇటీవల ప్రియాంకా చోప్రా పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. నిక్‌ వయసులో ప్రియాంక కన్నా చాలా చిన్నోడు. అదే ఆమె పెళ్లికి వచ్చిన అసలు సమస్య.

అయితే సెలబ్రిటీల్లో చాలామంది ఇలా వయసులో తేడా ఉన్నవారు ఉన్నారు. కానీ వారికెవ్వరికీ రాని సమస్య పాపం ప్రియాంకకే ఎందుకు రావాలి.? అయితే ప్రియాంక కన్నా, నిక్‌ ఏకంగా పదేళ్లు పైనే చిన్నోడు కావడంతో ఈ విమర్శలు ఎక్కువయ్యాయి. ఆమె అభిమానులు సైతం గుస్సా అవుతున్నారు. ఇకపోతే నేషనల్‌ మీడియా ప్రియాంకా, నిక్‌ వివాహంపై ఎన్ని రకాల ప్రచురణలు ముద్రించాలో అన్నీ ముద్రించేసింది. అమెరికా మీడియా అయితే నిక్‌ది బలవంతపు పెళ్లిగా పరిగణించింది. ఇలా ఒక్కటేమిటి.? ఆమె క్రాకర్స్‌ పేల్చినా వివాదమే అయ్యింది. గుర్రం, ఏనుగుపై ఊరేగినా వివాదమే అయ్యింది.

ఇలా పెళ్లి పేరు చెప్పి ప్రియాంకా పడుతున్న పాట్లు అన్నీ ఇన్నీ కావు. అవకాశం ఉన్న చోట తనదైన శైలిలో ఘాటుగా కౌంటర్స్‌ ఇస్తూనే వస్తోంది. పెళ్లి అనేది పూర్తిగా పర్సనల్‌ ఇష్యూ. దాంట్లో మీడియా, ఇతరులు జోక్యం అవసరం లేదు.. అంటూ ప్రియాంకా సన్నిహితులు మరో పక్క మొత్తుకుంటున్నారు కూడా. మరి చూడాలిక ముందు ముందు ప్రియాంకా పెళ్లి కారణంగా ఇంకా ఎన్ని చివాట్లు పడాల్సి వస్తుందో. 

You May Like This
- Advertisment -spot_img

Most Popular