HomeMovie News Teluguదిశా పటానీ.. పెళ్ళి పీటలెక్కబోతోందా.?

దిశా పటానీ.. పెళ్ళి పీటలెక్కబోతోందా.?

దిశా పటానీ


బాలీవుడ్‌లో పెళ్ళిళ్ళ సీజన్‌ నడుస్తోంది. మొన్న సోనమ్‌ కపూర్‌, నిన్న దీపికా పడుకొనే – రణ్‌వీర్‌ సింగ్‌, ఆ తర్వాత లైన్‌లో ప్రియాంకా చోప్రా – నిక్‌ వివాహం.. నెక్స్‌ట్‌ ఏంటీ.! ఇంకెవరు, దిశా పటానీ – టైగర్‌ ష్రాఫ్‌ల పెళ్ళేనంటూ బాలీవుడ్‌ సినీ జనాలు చెవులు కొరుక్కుంటున్నారు. దిశా పటానీ – టైగర్‌ ష్రాఫ్‌ మధ్య ఎఫైర్‌ చాలాకాలంగా నడుస్తోంది. ఆ తర్వాత ఇద్దరూ విడిపోయారన్న ప్రచారమూ జరిగింది. అయితే, అదంతా ఉత్తదేనని తేలిపోయింది.

‘బాఘి-2’ సినిమా టైమ్‌లో ఇద్దరి మధ్యా ఎఫైర్‌ పీక్స్‌కి వెళ్ళిపోయింది. ఇద్దరూ సహజీవనం చేస్తున్నారన్న గుసగుసలు కూడా విన్పించాయి. తాజాగా ఈ ఇద్దరూ దీపికా పడుకొనే – రణ్‌వీర్‌ సింగ్‌ల వెడ్డింగ్‌ రిసెప్షన్‌లో సెంటర్‌ ఆఫ్‌ ఎట్రాక్షన్‌ అయ్యారు. మొత్తంగా ఈ వేడుకలో హాటెస్ట్‌ అవతార్‌ ఎవరిదైనా వుందంటే, అది దిశా పటానీది మాత్రమే. సోషల్‌ మీడియాని ‘ఇన్నర్‌ వేర్‌ హాట్‌నెస్‌తో’ హీటెక్కించేస్తోన్న దిశా పటానీ, దీప్‌-వీర్‌ వెడ్డింగ్‌ రిసెప్షన్‌లో హెవీ డోస్‌ క్లీవేజ్‌తో కిర్రాకు పుట్టించింది.

క్లీవేజ్‌ సొగసుల వ్యవహారం పక్కన పెడితే, దిశా పటానీ – టైగర్‌ ష్రాఫ్‌ జంటగా కన్పించడం, ఇద్దరూ చాలాసేపు కలిసి తిరగడం, అందర్నీ ఆశ్చర్యపరిచింది. దాంతో, బాలీవుడ్‌ సినీ జనం త్వరలోనే ఈ జంట ఓ తీపి కబురు చెప్పబోతోందని ఫిక్సయిపోయారు. దిశా – టైగర్‌ ఈ ప్రచారంపై పెదవి విప్పుతారా.? తమ మధ్య రిలేషన్‌ని కన్‌ఫామ్‌ చేస్తారా.? అంతా ఉత్తదేనని లైట్‌ తీసుకోమంటారా? ఏం జరుగుతుందో వేచి చూడాలిక.

You May Like This
- Advertisment -spot_img

Most Popular