HomeMovie News Teluguప్ర‌ముఖ క‌న్న‌డ న‌టుడు అంబ‌రీష్ ఇక లేరు...

ప్ర‌ముఖ క‌న్న‌డ న‌టుడు అంబ‌రీష్ ఇక లేరు…

ప్ర‌ముఖ క‌న్న‌డ న‌టుడు, క‌న్న‌డీగుల‌కు రెబ‌ల్ స్టార్ అయిన‌… అంబ‌రీష్ మ‌ర‌ణం అభిమానుల్ని క‌ల‌చి వేస్తోంది. 

శ‌నివారం రాత్రి ప‌ది గంట‌ల‌కు ఆయ‌న క‌న్ను మూశారు. గ‌త కొంత‌కాలంగా ఆయ‌న శ్వాస కోస స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. దానికి సంబంధించిన చికిత్స కూడా తీసుకుంటున్నారు. అయితే… బెంగ‌ళూరులోని మండ్య జిల్లాలో శ‌నివారం జ‌రిగిన ప్ర‌మాదం అంబ‌రీష్‌ని క‌ల‌చి వేసింది. ఈ ప్ర‌మాదంలో 30 మంది మ‌ర‌ణించారు. 

ఈ వార్త విన్న వెంట‌నే… అంబ‌రీష్ ఉద్వేగానికి గుర‌య్యారు. త‌న‌కు ఆరోగ్యం స‌రిగా లేద‌ని.. బాగుంటే.. బాధితుల్ని ప‌రామ‌ర్శించ‌డానికి వెళ్లేవాడిన‌ని పాత్రికేయుల‌కు. త‌న సన్నిహితుల‌కు కూడా తెలిపారు. అప్ప‌టి నుంచీ.. ఆయ‌న ఆరోగ్యం మ‌రింత ప‌ట్టుత‌ప్పింది. వెంట‌నే కుటుంబ స‌భ్యులు ఆసుప‌త్రికి త‌ర‌లించారు. అయితే… రాత్రి ప‌ది గంట‌ల‌కు ఆయ‌న క‌న్నుమూశారు. 

మ‌లయాళం, త‌మిళం, హిందీల‌తో పాటు కొన్ని తెలుగు చిత్రాల్లోనూ మెరిశారు అంబ‌రీష్‌. న‌టి సుమల‌త‌ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు. మూడు ప‌ర్యాయాలు ఎంపీగా ప‌నిచేశారు. ఓసారి స‌మాచార‌, ప్ర‌చార స‌హాయ మంత్రిగా సేవ‌ల్ని అందించారు.

You May Like This
- Advertisment -spot_img

Most Popular