HomeMovie News Telugu'ట్యాక్సీవాలా'.. కుమ్మి అవతల పారేశాడు!

‘ట్యాక్సీవాలా’.. కుమ్మి అవతల పారేశాడు!

విజయ్‌ దేవరకొండకి హిట్‌ వస్తే ఎలా వుంటుందో తెలుసా? ఇంకెలా వుంటుంది, ‘ట్యాక్సీవాలా’లా వుంటుందని చెప్పాలి. సినిమా మూడు నెలల క్రితమే హెచ్‌డీ ప్రింట్‌ లీక్‌ అయ్యింది. అయితేనేం, అది విజయ్‌ దేవరకొండ సినిమా. ‘నోటా’ విషయంలో కొంచెం తేడా కొట్టిందిగానీ, ‘ట్యాక్సీవాలా’ సినిమాకొచ్చేసరికి విజయ్‌ దేవరకొండ సత్తా ఏంటో ఇంకోసారి ప్రూవ్‌ అయ్యింది. 

తొలి రోజే బ్రేక్‌ ఈవెన్‌ అవడమంటే చిన్న విషయం కాదు. అచ్చంగా 10.5 కోట్ల గ్రాస్‌ కొల్లగొట్టింది ‘ట్యాక్సీవాలా’ తొలి రోజున. విజయ్‌ కెరీర్‌లో బిగ్గెస్ట్‌ హిట్‌ అనలేంగానీ, ప్రత్యేక పరిస్థితుల్లో ఇంతటి విజయం విజయ్‌ దేవరకొండకి మాత్రమే చెల్లింది. ఇంకో ముఖ్యమైన విషయమేంటంటే, పైరసీ చేయాలనుకునేవారికి.. లీక్‌ చేసి శునకానందం పొందాలనుకునేవారికి ఈ సినిమా విజయం చెంపపెట్టులాంటిది. పవన్‌కళ్యాణ్‌ నటించిన ‘అత్తారింటికి దారేది’ కూడా విడుదలకు ముందే లీక్‌ అయ్యింది. ఆ సినిమా కూడా ఘనవిజయం సాధించింది. 

ఇప్పుడు విజయ్‌ దేవరకొండకీ అదే కష్టం ఎదురయ్యింది, అదే మ్యాజిక్‌ రిపీట్‌ అయ్యిందని సినీ పరిశ్రమలో అందరూ చర్చించుకుంటున్నారు. మామూలుగా అయితే శనివారం సినిమా రిలీజ్‌ ఎంతో రిస్క్‌. దండగ వ్యవహారమని భావిస్తారు. కానీ ‘ట్యాక్సీవాలా’ లీక్‌ కంటే పెద్ద కష్టం ఇంకేముంటుందని అనుకున్నారు ఆ చిత్ర నిర్మాత. కానీ ప్రేక్షకులు అనూహ్య విజయాన్నిచ్చారు. శని, ఆదివారాల్లో బంపర్‌ వసూళ్ళు వచ్చిపడ్డాయి. చెప్పుకోదగ్గ సినిమా ఏదీ ప్రస్తుతానికి లేకపోవడంతో ‘ట్యాక్సీవాలా’కి ఈ వారమంతా పండగే.

You May Like This
- Advertisment -spot_img

Most Popular