HomeMovie News Teluguఫన్‌.. మోర్‌ ఫన్‌. అదిరిందంతే!

ఫన్‌.. మోర్‌ ఫన్‌. అదిరిందంతే!

‘ఫన్‌ అండ్‌ ఫ్రస్ట్రేషన్‌’.. అంటూ విక్టరీ వెంకటేష్‌, మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌ ఫస్ట్‌ లుక్‌ని తీసుకొచ్చేశారు. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో ‘ఎఫ్‌2’ సినిమా తెరకెక్కుతోన్న విషయం విదితమే. ఈ సినిమాలో తమన్నా, మెహరీన్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అనిల్‌ రావిపూడి సినిమాలంటే ఫుల్‌ లెంగ్త్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ని ఆశించొచ్చు. ఈ సినిమాలో ఆ అంచనాల్ని మించి ఫన్‌ వుండబోతోందట. 

విక్టరీ వెంకటేష్‌ అంటేనే, ఫన్‌కి కేరాఫ్‌ అడ్రస్‌. వెంకీ – వరుణ కలిసి సినిమాలో బోల్డంత సందడి చేసేయబోతున్నారట. వీరికి తోడు తమన్నా, మెహరీన్‌ గ్లామర్‌ ఈ సినిమాకి అదనపు బోనస్‌ అని చిత్ర యూనిట్‌ వర్గాలు చెబుతున్నాయి. దీపావళి సందర్భంగా ఫస్ట్‌ లుక్‌ని విడుదల చేసిన చిత్ర దర్శక నిర్మాతలు, సినిమా సూపర్‌ హిట్‌ అవుతుందనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. ‘ఎఫ్‌2’ ఫస్ట్‌ లుక్‌ విడుదలవడంతోనే టాలీవుడ్‌ ప్రముఖుల నుంచి ఈ ఫస్ట్‌ లుక్‌కి బీభత్సమైన రెస్పాన్స్‌ షురూ అయ్యింది. 

సినీ పరిశ్రమలోనే ఈ కాంబోపై వున్న క్రేజ్‌ ఏంటో, ఫస్ట్‌ లుక్‌కి వస్తున్న స్పందనని బట్టి అర్థం చేసుకోవచ్చు. టాలీవుడ్‌లో ఇప్పుడంతా మల్టీస్టారర్స్‌ ట్రెండ్‌ నడుస్తోంది. వెంకీ గతంలో మహేష్‌తో కలిసి ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమా చేసిన సంగతి తెల్సిందే. ఇప్పుడు మెగా హీరో వరుణ్‌ తేజ్‌తో ‘ఎఫ్‌2’ సినిమా చేస్తున్నాడు. 

మరోపక్క, సోలో హీరోగా వెంకీ నుంచి మరో సినిమాకి సంబంధించిన ప్రకటన రాబోతోంది.

You May Like This
- Advertisment -spot_img

Most Popular