HomeMovie News Teluguముగ్గురు భామలతో విజయ్‌ దేవరకొండ

ముగ్గురు భామలతో విజయ్‌ దేవరకొండ

ఒకరు కాదు, ఇద్దరు కాదు.. ఏకంగా ముగ్గురు అందాల భామలతో జత కట్టబోతున్నాడు యంగ్‌ హీరో విజయ్‌ దేవరకొండ. సూపర్‌ స్టార్‌ ఇమేజ్‌కి కాస్త దూరంలో ‘నోటా’ సినిమా కారణంగా చతికిలపడ్డ విజయ్‌ దేవరకొండ, బౌన్స్‌ బ్యాక్‌ అవుతానంటూ ఇటీవల ప్రకటించిన సంగతి తెల్సిందే. 

ఇదిలావుంటే, విజయ్‌ దేవరకొండ తాజా సినిమాపై అనౌన్స్‌మెంట్‌ వచ్చింది. ఆ చిత్రానికి క్రాంతి మాధవ్‌ డైరెక్టర్‌. సీనియర్‌ నిర్మాత కె.ఎస్‌రావు సమర్పణలో, ఆయన కుమారుడు వల్లభ ఓ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. క్రియేటివ్‌ కమర్షియల్స్‌ బ్యానర్‌లో ఈ చిత్రం రూపొందతుంది. అందాల భామలు రాశి ఖన్నా, ఐశ్వర్య రాజేష్‌, ఇసాబెల్లె హీరోయిన్లు,. విజయ్‌ దేవరకొండ సరసన నటించబోతున్నారు.

ప్రస్తుతం విజయ్‌ దేవరకొండ నటించిన ‘కామ్రేడ్‌’, ‘టాక్సీవాలా’ విడుదలకు లైన్‌లో వున్నాయి. ‘ట్యాక్సీవాలా’ సినిమా విడుదలకు ముందే లీక్‌ అయ్యింది. సినిమా మొత్తం లీక్‌ అవడంతో, సినిమా రిలీజ్‌ అవుతుందో లేదో తెలియని పరిస్థితి నెలకొంది. మొన్న గీతా ఆర్ట్స్‌లో ‘గీత గోవిందం’, ఆ తర్వాత స్టూడియో గ్రీన్‌ పతాకంపై ‘నోటా’, తాజాగా క్రియేటివ్‌ కమర్షియల్‌ బ్యానర్‌లో కొత్త సినిమా.. చూస్తోంటే, పెద్ద బ్యానర్లు విజయ్‌ దేవరకొండ ముందు క్యూ కడుతున్నట్లే కన్పిస్తోంది. 

ఒక్క సినిమా ఫ్లాపయితేనేం.. ముందు ముందు వరుస సినిమాలతో హల్‌చల్‌ చేయబోతున్నాడు ‘రౌడీ’ అంటూ, విజయ్‌ దేవరకొండ అభిమానులు.. అదేనండీ ‘రౌడీస్‌’ సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేసేస్తున్నారు.

You May Like This
- Advertisment -spot_img

Most Popular