HomeMovie News Teluguయాంకర్‌ రవిని అలా ఆడేసుకుంటున్నారు.!

యాంకర్‌ రవిని అలా ఆడేసుకుంటున్నారు.!

ఏ విషయంలోనైనా ఏమాత్రం నోరు జారినా ఎక్కడైనా తప్పించుకోవచ్చు. కానీ సోషల్‌మీడియాలో మాత్రం తప్పించుకోవడం వల్ల కావడం లేదు. ఓ ఆట ఆడుకుంటే కానీ వదిలి పెట్టడం లేదు నెటిజన్లు. ఇక తమ అభిమాన సెలబ్రిటీల జోలికి వచ్చారా? ఇక అంతే సంగతి. 

ఇప్పుడీ విషయం ఎందుకంటే. బుల్లితెర రియాల్టీ షో బిగ్‌బాస్‌ మేనియా నడుస్తోన్న సంగతి తెలిసిందే. అందులోనూ కౌషల్‌కి సోషల్‌ మీడియాలో ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కౌషల్‌కు వ్యతిరేకంగా ఎవరైనా ఈ ఆర్మీకి చిక్కారా అంతే వారి పనైపోయినట్లే. పొరపాటున తప్పుడు మాటలు దొర్లితే బిగ్‌బాస్‌ హోస్ట్‌ నానినే వదిలిపెట్టడం లేదు కౌషల్‌ ఆర్మీ. 

ఇకపోతే తాజాగా యాంకర్‌ రవి ఈ కౌషల్‌ ఆర్మీ దృష్టిలో పడ్డాడు. అసలీ యాంకర్‌ రవికి ఏం సంబంధం అంటారా? ఓ ప్రముఖ ఛాలెల్‌లో యాంకర్‌ రవి హోస్ట్‌గా ఉన్న ఓ ప్రోగ్రమ్‌లో కౌషల్‌పైనా, కౌషల్‌ ఆర్మీ పైనా కొన్ని సెటైర్లు వేయడం జరిగింది. అందుకు కౌషల్‌ అభిమానులు సోషల్‌ మీడియా వేదికగా యాంకర్‌ రవిని విమర్శిస్తూ పోస్టులు పెట్టారు. అందుకు యాంకర్‌ రవి స్పందించాడు. 

నాకు ఎవరి పైనా ద్వేషం లేదు. నేను ఎవర్నీ ఉద్దేశించి ఏమీ మాట్లాడలేదు. అయితే ఇలా కారణం లేకుండా కుటుంబ సభ్యుల్ని నిందించడం బాధనిపిస్తోంది అంటూ తనపై వచ్చిన విమర్శలకు యాంకర్‌ రవి కౌంటర్‌ ఇచ్చాడు. దాంతో కౌషల్‌ అభిమానులు గతంలో జరిగిన ఓ విషయాన్ని జ్ఞప్తికి తెస్తూ మరోసారి ట్రోలింగ్ మొదలెట్టారు. 

గతంలో ఓ ఆడియో ఫంక్షన్‌లో నటుడు చలపతిరావు ఆడవారిని కించపరుస్తూ వ్యాఖ్యలు చేసినప్పుడు అదే వేదికపై హోస్ట్‌గా వ్యవహరిస్తున్న యాంకర్‌ రవి ‘మీరు సూపర్‌ సార్‌.!’ అని పొగుడుతున్న వీడియోలు పోస్ట్‌ చేసి, యాంకర్‌ రవిపై విమర్శనాస్త్రాలు సంధించారు. అలా సోషల్‌ మీడియాలో యాంకర్‌ రవికీ, కౌషల్‌ అభిమానులకు మధ్య చిచ్చు రగిలింది.

You May Like This
- Advertisment -spot_img

Most Popular