HomeMovie News Teluguచైతూకి సమంత సిర్టిఫికెట్‌ ఇచ్చేసింది.!

చైతూకి సమంత సిర్టిఫికెట్‌ ఇచ్చేసింది.!

పెళ్లి తర్వాత నాగచైతన్య హీరోగా వస్తున్న సినిమా ‘శైలజారెడ్డి అల్లుడు’. ఫుల్‌ మీల్స్‌ లాంటి సినిమా ఇది అని సమంత చైతూకి సర్టిఫికెట్‌ ఇచ్చేసింది. సినిమా చాలా చాలా బాగుంది. ఆయనకు మంచి విజయం దక్కుతుందని సమంత చెప్పింది. 

అనుకోకుండా మా ఇద్దరి సినిమాలు ఒకేరోజు ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి ఇది డెస్టినీ. నా సినిమా విజయంతో పాటు, నా భర్త విజయం కూడా నాకు ముఖ్యమే. ఈ సినిమాను అందరూ ఆదరించి, మంచి విజయం అందించాలని అభిమానులను కోరింది సమంత. ఇప్పుడు వేర్వేరు సినిమాలతో ఇద్దరూ ఒకేసారి ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. తర్వాత ఇద్దరూ కలిసి స్క్రీన్‌ షేర్‌ చేసుకోబోతున్నారు. 

శివ నిర్వాణ దర్శకత్వంలో చైతూ, సమంత కలిసి ఓ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా అక్టోబర్‌ 6న ప్రారంభం కానుంది. మంచి రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ అట ఈ సినిమా. అలాగే కొన్ని థ్రిల్లింగ్‌ అంశాలతో రూపొందనుందనీ తెలుస్తోంది. ఈ ఏడాది సమంత చేసిన సినిమాలన్నీ మంచి విజయాలందుకున్నాయి. అలాగే ‘యూటర్న్‌’ చిత్రంతోనూ ఆమె హిట్‌ కొడుతుందని భావిస్తున్నారు. అలాగే మరో కొత్త సినిమాకీ సమంత లేటెస్టుగా సైన్‌ చేసిందట. ఆ సినిమా వివరాలు త్వరలో చెబుతానంటోంది. 

తన సినిమా ‘యూటర్న్‌’కీ, భర్త చైతూ ‘శైలజారెడ్డి అల్లుడు’ సినిమాకీ ఎట్‌ ఏ టైమ్‌ ఈ రకంగా ప్రమోషన్స్‌ నిర్వహించేసింది సమంత. చాలా తెలివైన పిల్ల కదా. అక్కినేని వారి కోడలా మజాకానా.!

You May Like This
- Advertisment -spot_img

Most Popular