HomeMovie News Teluguబన్నీ బాలీవుడ్‌ ఎంట్రీ నిజమేనా?

బన్నీ బాలీవుడ్‌ ఎంట్రీ నిజమేనా?

స్టైలిష్‌స్టార్‌ బన్నీ బాలీవుడ్‌లో అడుగుపెట్టబోతున్నారా? అంటే అవునంటున్నాయి బాలీవుడ్‌ వర్గాలు. బాలీవుడ్‌లో తాజాగా మాజీ టీమిండియా క్రికెట్‌ కెప్టెన్‌ కపిల్‌దేవ్‌ బయోపిక్‌ తెరకెక్కుతోంది. ఈ సినిమాతోనే బన్నీ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారంటూ తాజాగా ప్రచారం జరుగుతోంది. 

కపిల్‌దేవ్‌ పాత్రలో రణ్‌వీర్‌ సింగ్‌ నటిస్తుండగా, మరో క్రికెట్‌ దిగ్గజం కృష్ణమాచారి శ్రీకాంత్‌ పాత్రలో బన్నీ నటించబోతున్నాడనీ టాక్‌ వినిపిస్తోంది. అయితే బన్నీ బాలీవుడ్‌ సినిమాలపై అంతగా దృష్టి పెట్టలేదింతవరకూ. ఒకవేళ ఈ ప్రచారం నిజమైతే బాలీవుడ్‌లో బన్నీ చేయబోయే తొలి సినిమా ఇదే అవుతుంది. అయితే ఈ ప్రచారానికి సంబంధించి అఫీషియల్‌ క్లారిటీ లేదు. 

‘నా పేరు సూర్య’ సినిమా తర్వాత బన్నీ తదుపరి సినిమా ఇదట..అదట.. అంటూ ప్రచారాలు, గాసిప్స్‌ తెగ చక్కర్లు కొడుతున్నాయి. కానీ బన్నీ నుండి స్పష్టత రావడం లేదు ఆ గాసిప్స్‌ విషయంలో. ఇంతకు ముందే బన్నీ చెప్పేశాడు తన తదుపరి సినిమా విషయంలో అభిమానులు ఓపిక పట్టాలని.. తన నుండి రాబోయే తదుపరి చిత్రం అభిమానులు ఖచ్చితంగా మెచ్చుకోదగ్గ చిత్రమే అవుతుందనీ అభిమానులకు భరోసా ఇచ్చాడు బన్నీ. అయినా కానీ ఈ గాసిప్స్‌ ఆగడం లేదు. 

తెలుగులో విక్రమ్‌ కుమార్‌తో బన్నీ సినిమా దాదాపు ఓకే అయ్యిందనీ, త్వరలోనే సెట్స్‌ మీదికెళ్తుందనీ, సమంత ఆ సినిమాలో హీరోయిన్‌ అనీ ఇలా రకరకాల గాసిప్స్‌ ఒకదానిపై ఒకటి చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. చూడాలి మరి బన్నీ నెక్స్ట్‌ ఏ సినిమాతో రాబోతున్నాడో.!

You May Like This
- Advertisment -spot_img

Most Popular