HomeMovie News Teluguతారక్‌ గురువు ఎవరో తెలుసా?

తారక్‌ గురువు ఎవరో తెలుసా?

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం ‘అరవింద సమేత వీర రాఘవ’. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో ప్రముఖ హాస్య నటుడు, హీరో సునీల్‌ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో సునీల్‌ పాత్ర ఏంటీ.? అనే విషయంపైనే అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. 

హీరోగా వరుస ఫెయిల్యూర్స్‌ చవి చూస్తున్న సునీల్‌కి ఈ సినిమాలోని క్యారెక్టర్‌తో మంచి బ్రేక్‌ ఇవ్వాలని నిశ్చయించుకున్నాడట డైరెక్టర్‌ త్రివిక్రమ్‌. సునీల్‌, త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ మంచి స్నేహితులన్న సంగతి అందరికీ తెలిసిందే. అందుకే సునీల్‌ కెరీర్‌ని తన సినిమాతో దారిన పెట్టేందుకు గట్టి ప్రయత్నమే చేశాడట. అయితే ఈ సినిమాలో సునీల్‌ పాత్ర ఏంటీ.? అంటే ఎన్టీఆర్‌కి సలహాలిచ్చే గురువు గారి పాత్ర అని ప్రచారం జరుగుతోంది. 

అయితే గురువుగారు అంటే, పంచె కట్టుకుని, నామాలు పెట్టుకునే గురువు కాదంతే. ఆల్రెడీ సునీల్‌ గెటప్‌ టీజర్‌లో కనిపించింది. నార్మల్‌గానే ఉన్నాడు. హారికా హాసినీ క్రియేషన్స్‌ బ్యానర్‌లో రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాయలసీమ కుర్రాడి పాత్రలో తారక్‌ ఆకట్టుకోనున్నాడు ఈ సినిమాలో. 

పూజా హెగ్దే హీరోయిన్‌గా నటిస్తోంది. తెలుగమ్మాయి ఈషా రెబ్బకి ఓ ఇంపార్టెంట్‌ రోల్‌ దక్కింది. తమన్‌ స్వర సంగీతంలో ‘అరవింద సమేత..’ దసరాకి ప్రేక్షకుల ముందుకు రానుంది.

You May Like This
- Advertisment -spot_img

Most Popular