HomeMovie News Teluguరోడ్డు ప్రమాదంలో నందమూరి హరికృష్ణ మృతి..!

రోడ్డు ప్రమాదంలో నందమూరి హరికృష్ణ మృతి..!

ఈరోజు తెల్లవారుజామున హైదరాబాద్-విజయవాడ హైవే లో గల అనపర్తి (నార్కట్ పల్లి కి సమీపంలో) జరిగిన రోడ్డు ప్రమాదంలో నందమూరి హరికృష్ణ (62)మృతి చెందారు.

వివరాల్లోకి వెళితే, ఈరోజు నెల్లూరు జిల్లాలోని కావలి లో ఒక వివాహ వేడుకకి హాజరయ్యేందుకు హరికృష్ణ సహా మరో ఇద్దరితో కలిసి కారు నడుపుకుంటూ వెళ్ళే సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రాధమికంగా అతివేగమే ఈ ప్రమాధానికి కారణం అని తెలియచేస్తున్నారు.

ప్రమాద తీవ్రతకి ఆయన కారు నుండి బయటపడడంతో తలకి తీవ్ర గాయాలయ్యాయి, స్థానికులు వెంటనే స్పందించి ఆయనని దగ్గరిలోని కామినేని ఆసుపత్రికి తరలించారు. వైద్యులు తీవ్రంగా ప్రయత్నించినప్పటికి తలకి తీవ్రగాయాలు కావడంతో హరికృష్ణని కాపాడలేకపోయారు.

ఈ విషాద సమయంలో హరికృష్ణ మృతికి www.iQlikmovies.com తరపున తీవ్ర సంతాపం తెలియచేస్తున్నాము.

You May Like This
- Advertisment -spot_img

Most Popular