HomeMovie News Teluguచరణ్‌ స్కెచ్‌ మామూలుగా లేదు.!

చరణ్‌ స్కెచ్‌ మామూలుగా లేదు.!

మెగాస్టార్‌ బర్త్‌డేకి ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా టీజర్‌ని విడుదల చేసి చరణ్‌ స్ట్రేటజీ ఏంటో ప్రూవ్‌ చేసుకున్నాడు. ఆ టీజర్‌తో తన తండ్రి చిరంజీవికి బెస్ట్‌ గిఫ్ట్‌ ఇచ్చినట్లే ఇచ్చి, ఫ్యాన్స్‌ని అమితానందచకితుల్ని చేసేశాడు. ఇప్పుడు బాబాయ్‌ వంతు వచ్చింది. బాబాయ్‌ పుట్టినరోజు సందర్భంగా కూడా చరణ్‌ సమ్‌థింగ్‌ స్పెషల్‌ ప్లాన్‌ చేయబోతున్నాడట. 

అయితే ఈ సారి తన సినిమా ఫస్ట్‌లుక్‌ని బాబాయ్‌ చేతుల మీదుగా విడుదల చేసి, బాబాయ్‌కి గిఫ్ట్‌గా ఇచ్చే యోచనలో చరణ్‌ ఉన్నాడనీ తెలుస్తోంది. చరణ్‌ – బోయపాటి కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న చిత్రానికి సంబంధించి ఇంతవరకూ ఏ సమాచారమూ లేదు. సైలెంట్‌గా సినిమా షూటింగ్‌ జరిగిపోతోంది. ఎప్పుడో విడుదల కానున్న ‘సైరా’కి సంబంధించే ఆ రేంజ్‌లో ఫస్ట్‌లుక్‌ టీజర్‌ని విడుదల చేశాడు చరణ్‌. ఇక అతి త్వరలోనే విడుదల కాబోయే తన చిత్రానికి సంబంధించి ఎలాంటి సర్‌ప్రైజ్‌ ఇవ్వాలి. అందుకే ఆ సర్‌ప్రైజ్‌ కూడా గట్టిగానే ఉండబోతోందట.

అంతేకాదు చిరంజీవి కుటుంబంతో, పవన్‌ కళ్యాణ్‌కి పొరపొచ్చాలున్నాయన్న గుసగుసలు ఎప్పటికప్పుడే పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తూనే ఉంటాయి. ఈ మధ్యనే పవన్‌ కళ్యాణ్‌, చిరు కుటుంబానికి కాస్త దగ్గరగా మసలుతున్నట్లు కనిపిస్తున్నాడు. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆయన ఇంటికి సతీ సమేతంగా విచ్చేసి, అన్నయ్యకు మనస్ఫూర్తిగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు. అలాగే ‘సైరా’ సెట్‌కి వెళ్లి అన్నయ్య చిరంజీవి, అబ్బాయ్‌ చరణ్‌తో ఫోటోలు కూడా దిగాడు. 

ఇదంతా సరిపోదన్నట్లుగా బాబాయ్‌ పుట్టినరోజున చరణ్‌ తన సినిమా ఫస్ట్‌లుక్‌ రిలీజ్‌ ప్లాన్‌ అదిరిపోయింది. బాబాయ్‌తో మెగా కుటుంబానికి ఎంత అటాచ్‌మెంట్‌ ఉందో స్వయంగా తెలియజేయడానికి ఇంతకన్నా మంచి అవకాశం ఇంకేముంటుంది చరణ్‌కి చెప్పండి.

You May Like This
- Advertisment -spot_img

Most Popular