HomeMovie News Teluguవర్మ కంటికి చిక్కిన మరో చక్కనమ్మ.!

వర్మ కంటికి చిక్కిన మరో చక్కనమ్మ.!

‘చక్కనమ్మ’ అనలేం కానీ, వర్మ కంపెనీ నుండి దిగుమతి అవుతోన్న మరో శృంగార భామ. పేరు ఇరా. వర్మ తన సొంత బ్యానర్‌ కంపెనీలో మరో నిర్మాతతో కలిసి ఓ సినిమాని రూపొందిస్తున్నారు. ఈ సినిమాతోనే ఈ అందాల భామ తెలుగు తెరకు పరిచయమవుతోంది. సినిమా పేరు ‘భైరవగీత’. 

తెలుగు, కన్నడ భాషల్లో ఈ సినిమా రూపొందుతోంది. అయితే ఈ సినిమాకి వర్మ దర్శకత్వం వహించడం లేదు. కేవలం నిర్మాత మాత్రమే. అయినా సినిమాలో కంటెన్ట్‌ మాత్రం వర్మ మార్క్‌ కంటెన్టేనని తెలుస్తోంది. అదే బోల్డ్‌నెస్‌, అదే హింసాత్మకం, అదే అరాచకం. అంతా వర్మ స్టైల్‌లోనే ఈ సినిమా ఉండబోతోందట. ఒక గ్రామంలో భూస్వాములకు, పేదవాళ్లకు మధ్య జరిగే వర్గ పోరాటం నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతోంది. ఇందులోనే ఓ రొమాంటిక్‌ లవ్‌ స్టోరీ మిళితమై ఉంటుందట. 

ఈ సినిమాలో హీరోయిన్‌ కోసం జరిపిన ఆడిషన్స్‌లో వర్మ కంట్లో పడిన ఆ ముద్దుగుమ్మే ఇరా. సినిమాలో బోల్డ్‌గా నటించేసిందట. ఆ బోల్డ్‌నెస్‌ వర్మని ఎంతో ఇంప్రెస్‌ చేసేసిందట. ఎప్పుడూ చెప్పే మాటే కదా. ఈ సినిమాతో సిద్ధార్ద్‌ అనే యంగ్‌స్టర్‌ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఈ సినిమా గురించి, సినిమాలో హీరోయిన్‌ ఇరా బోల్డ్‌నెస్‌ గురించి మన వర్మగారు అప్పుడే పబ్లిసిటీ స్టార్ట్‌ చేసేశారు. 

చూడాలి మరి, వర్మ గత చిత్రాల మాదిరిగా ఈ సినిమా కూడా కాంట్రవర్సీతో కూడిన పబ్లిసిటీని ఖాతాలో వేసుకుంటుందో లేక, గ్లామర్‌ ఎలిమెంట్‌ ప్లస్‌ కంటెన్ట్‌తో ‘ఆర్‌ ఎక్స్‌ 100’ సినిమా మాదిరి సూపర్‌ హిట్‌ టాక్‌ సంపాదించుకుంటుందో.!

You May Like This
- Advertisment -spot_img

Most Popular