HomeMovie News Telugu'స్నేహమా.. ప్రేమా..' నయనతార సంగతేంటి చెప్మా.!

‘స్నేహమా.. ప్రేమా..’ నయనతార సంగతేంటి చెప్మా.!

సౌత్‌ క్వీన్‌ నయన్‌తార ప్రేమ లీలలు ఎప్పుడూ ఇండస్ట్రీ హాట్‌ టాపిక్కే. తాజాగా ఆమె తమిళ డైరెక్టర్‌ విఘ్నేష్‌ శివన్‌తో పీకల్లోతు ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. ఆ ప్రేమకు సంబంధించిన పలు ఫోటోలు, వీడియోలు అప్పుడ్పుపూ నెట్టింట్లో వైరల్‌ అవుతుండడం కామనే. తాజాగా ఫ్రెండ్‌షిప్‌ డే సందర్భంగా ఈ ప్రేమ జంట తమ స్నేహ బంధాన్ని, ప్రేమ బంధాన్ని ఓ ఫోటో ద్వారా చాటుకున్నారు. 

నయన్‌, విఘ్నేష్‌ పక్క పక్కన కూర్చొని, చేయి చేయి పట్టుకుని ఉన్న ఈ ఫోటోకి రికార్డు స్థాయిలో వ్యూస్‌ వచ్చేశాయి. ఫోటోపై ‘ఈ స్నేహంలో చాలా చాలా ప్రేమ ఉంది. ఈ ప్రేమలో చాలా చాలా స్నేహం ఉంది..’ అనే క్యాప్షన్‌తో ఈ ఫోటోని విఘ్నేష్‌ శివన్‌ పోస్ట్‌ చేశాడు. ఎప్పటికప్పుడే స్పెషల్‌ సందర్భాల్లో ఈ జంట తమ మధ్య ప్రేమను ఇలా ఎక్స్‌ప్రెస్‌ చేసుకోవడం మామూలైపోయింది. తాజాగా పోస్ట్‌ చేసిన ఫోటో మాత్రం సమ్‌థింగ్‌ ఇంట్రెస్టింగ్‌గా ఉంది. 

మరోవైపు నయన్‌, విఘ్నేష్‌కీ ఆల్రెడీ నిశ్చితార్ధం అయిపోయిందనీ, త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నారనే వార్త ఎప్పటి నుండో హల్‌చల్‌ చేస్తోంది. గతంలో ఓ అవార్డు ఫంక్షన్‌లో ‘విఘ్నేష్‌ తన లైఫ్‌ పాట్నర్‌..’ అంటూ ఇన్‌డైరెక్ట్‌గా నయనతార బయటపడింది కూడా. అయితే అఫీషియల్‌గా మాత్రం క్లారిటీ ఇవ్వట్లేదు వీరిద్దరూ. 

ప్రస్తుతం నయనతార చేతి నిండా సినిమాలతో ఫుల్‌ బిజీగా గడుపుతోంది. తమిళ సినిమాలతో పాటు, తెలుగులోనూ సీనియర్‌ హీరోల ఇంపార్టెంట్‌ ప్రాజెక్టులకు మెయిన్‌ ఆప్షన్‌ నయనతారే. టాలీవుడ్‌లో ప్రజెంట్‌ బిగ్‌ ప్రాజెక్ట్‌ అయిన ‘సైరా నరసింహారెడ్డి’లో మెగాస్టార్‌ చిరంజీవి సరసన నయనతార హీరోయిన్‌గా నటిస్తున్స సంగతి తెలిసిందే.

You May Like This
- Advertisment -spot_img

Most Popular