HomeMovie News Teluguచై,శామ్‌ ఇలా ట్విస్ట్‌ ఇచ్చారేంటీ.?

చై,శామ్‌ ఇలా ట్విస్ట్‌ ఇచ్చారేంటీ.?

పెళ్లి తర్వాత నాగచైతన్య, సమంత కలిసి స్క్రీన్‌ షేర్‌ చేసుకోబోతున్నారన్న సంగతి తెలిసిందే. ‘నిన్ను కోరి’ డైరెక్టర్‌ శివ నిర్వాణ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. టైటిల్‌ ఇంకా ఫిక్స్‌ చేయలేదు కానీ, ఇదో సస్పెన్స్‌ థ్రిల్లర్‌ సినిమా అని తెలియవస్తోంది. 

పక్కా లవ్‌స్టోరీ అనుకుంటే, చై, శామ్‌ ఇలా ట్విస్ట్‌ ఇచ్చారేంటో.! అయితే కథలో బలమైన లవ్‌ స్టోరీ కూడా మిళితమై ఉంటుందట. ఆ లవ్‌ ట్రాక్‌ నచ్చే ఈ ఇద్దరూ ఈ కథకు ఓకే చెప్పారట. అయితే సస్పెన్స్‌ సంగతేంటంటే, ఇదో సరికొత్త థ్రిల్లర్‌ మూవీ అని తెలుస్తోంది. సమంత క్యాబ్‌ డ్రైవర్‌గా కనిపించనుందనీ ప్రచారం జరుగుతోంది. ఈ తరహా కథ డైరెక్టర్‌ శివకు కూడా కొత్తే. కానీ కథలో విషయం ఉండబట్టే ఈ జోనర్‌ సబ్జెక్ట్‌ని ఎంచుకున్నాడట. స్టార్‌ వేల్యూ ఉంటే ఇలాంటి జోనర్స్‌తోనూ విజయం అందుకోవచ్చునంటున్నాడు డైరెక్టర్‌. 

చూడాలి మరి శివ ఓవర్‌ కాన్ఫిడెన్స్‌ ఈ సినిమాకి విజయం తెచ్చిపెడుతుందో..లేదో. ఇకపోతే ప్రస్తుతం సమంత సస్పెన్స్‌ థ్రిల్లర్‌ జోనర్‌ అయిన ‘యూ టర్న్‌’ చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమాలో సమంత జర్నలిస్టు పాత్ర పోషిస్తోంది. ఈ మధ్య వరుసగా ‘రంగస్థలం’, ‘మహానటి’, ‘అభిమన్యుడు’ సినిమాలతో సూపర్‌ డూపర్‌ హిట్స్‌ అందుకున్న సమంతకు ‘యూ టర్న్‌’ కూడా మంచి హిట్‌ తెచ్చిపెడుతుందని ఫిల్మ్‌ వర్గాలు భావిస్తున్నాయి. 

చైతూ విషయానికి వస్తే, ప్రస్తుతం చైతూ కూడా చాలా బిజీగా ఉన్నాడు. ‘సవ్యసాచి’, ‘శైలజా రెడ్డి అల్లుడు’ చిత్రాలు కొద్ది గ్యాప్‌లోనే త్వరలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. మామ వెంకీతో చైతూ నటిస్తున్న సినిమా ‘వెంకీ మామ’ లేటెస్టుగా స్టార్ట్‌ అయ్యింది.

You May Like This
- Advertisment -spot_img

Most Popular