HomeMovie News Teluguనందమూరి వారసుడు ఈ సారి పక్కా.!

నందమూరి వారసుడు ఈ సారి పక్కా.!

నందమూరి బాలయ్య తనయుడు మోక్షజ్ఞ హీరోగా తెరంగేట్రం చేయనున్నాడనీ గత కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. అసలు అన్నీ కలిసొస్తే, బాలయ్య 100వ చిత్రం ‘గౌతమీ పుత్ర శాతకర్ణి’యే మోక్షజ్ఞకు మొదటి చిత్రం కానుందని అభిమానులు ఆశించారు. కానీ అది జరగలేదు. 

ఇప్పుడు బాలయ్య 104వ చిత్రంగా డైరెక్టర్‌ క్రిష్‌ దర్శకత్వంలోనే తెరకెక్కుతోన్న ‘ఎన్టీఆర్‌’ బయోపిక్‌తో మోక్షజ్ఞ ఎంట్రీ షురూ అంటున్నాయి టాలీవుడ్‌ వర్గాలు. అంతేకాదు, ఈ దిశగా మోక్షజ్ఞ ఆల్రెడీ రెడీ అవుతున్నాడనీ టాక్‌ వినిపిస్తోంది. ప్రస్తుతం మోక్షజ్ఞ హీరోగా తనని తాను సిద్ధం చేసుకునేందుకు ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నాడట. ‘ఎన్టీఆర్‌’ బయోపిక్‌లో యంగ్‌ ఎన్టీఆర్‌ పాత్ర కోసం యంగ్‌ హీరో శర్వానంద్‌ పేరు వినిపించింది. 

కానీ క్రిష్‌ – బాలయ్య ఆ విషయంలో మనసు మార్చుకున్నారట. ఆ క్యారెక్టర్‌తోనే మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటే బావుంటుందని భావిస్తున్నారట. అందుకే తాత పాత్రతోనే మనవడు రంగ ప్రవేశం చేయబోతున్నాడనీ లేటెస్టుగా ప్రచారం జరుగుతోంది. ఈ సారైనా మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందా? లేక ఇది కూడా జస్ట్‌ ప్రచారమేనా? తేలాల్సి ఉంది. 

మరోవైపు క్రిష్‌ ఓ పక్క బాలీవుడ్‌లో ‘మణికర్ణిక’ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులతో పాటు, ‘ఎన్టీఆర్‌’ బయోపిక్‌కి సంబంధించి నటీనటుల ఎంపికలోనూ ఫుల్‌ బిజీగా ఉన్నాడు. ఇటు టాలీవుడ్‌ నుండీ, అటు బాలీవుడ్‌ నుండీ ప్రముఖ నటీనటులను ఎంచుకునే ఆలోచనలో క్రిష్‌ ఉన్నాడు.

You May Like This
- Advertisment -spot_img

Most Popular