HomeMovie News Teluguతారకరాముని ఇంట భార్గవ రాముడు

తారకరాముని ఇంట భార్గవ రాముడు

జూనియర్‌ ఎన్టీఆర్‌ తన రెండవ కుమారుడు ‘భార్గవరాముడు’ను అభిమానులకు పరిచయం చేశాడు. ఇటీవలే జూనియర్‌ ఎన్టీఆర్‌ రెండోసారి తండ్రయ్యాడు. ఎన్టీఆర్‌ భార్య లక్ష్మీ ప్రణతి రెండో కాన్పులో పండంటి మగబిడ్డకి జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఆ బాబుకు ఎన్టీఆర్‌ ‘భార్గవరాముడు’ అని నామకరణం చేశాడు. 

ఈ సందర్భంగా సతీమణి లక్ష్మీ ప్రణతి, మొదటి కుమారుడు అభయ్‌రామ్‌, రెండవకుమారుడు భార్గవ రాముడుతో ఎన్టీఆర్‌ కలిసి ఉన్న ఫోటోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. ఈ ఫోటో చూసి ఎన్టీఆర్‌ అభిమానులు ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. ఈ మధ్యనే పెద్ద కొడుకు అభయ్‌ రామ్‌, చిన్న కొడుకును ఎత్తుకుని ఉన్న ఫోటోను ఎన్టీఆర్‌ తన కెమెరాలో బంధిస్తుండగా, ఈ ముగ్గుర్నీ తన ఫోన్‌లో బంధించింది లక్ష్మీ ప్రణతి. ఈ ఫోటోను పోస్ట్‌ చేసి ఎన్టీఆర్‌ తన ఆనందాన్ని అభిమానులతో మనస్పూర్తిగా పంచుకుని మురిసిపోయాడు. 

ఇప్పుడు ఫుల్‌ ఫ్యామిలీ ఫోటోతో అంతకు మించిన ఫుల్‌ ఖుషీ ఇచ్చాడు. మొత్తానికి స్వర్గీయ నందమూరి తారక రామారావు మనవడైన జూనియర్‌ తారక రామారావు ఇంట మరో ఇద్దరు రాముళ్లు సందడి చేస్తున్నారన్న మాట. 

ఇకపోతే ఎన్టీఆర్‌ ప్రస్తుతం ‘అరవింత సమేత వీర రాఘవ’ చిత్రంలో నటిస్తున్నాడు. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో పూజా హెగ్దే, ఎన్టీఆర్‌కి జోడీగా నటిస్తోంది. హారికా హాసినీ క్రియేషన్స్‌ బ్యానర్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమా దసరాకి ప్రేక్షకుల ముందుకు రానుంది.

You May Like This
- Advertisment -spot_img

Most Popular