HomeMovie News Teluguఇలియానాపై ఇంత మోజెందుకు?

ఇలియానాపై ఇంత మోజెందుకు?

తెలుగులో స్టార్‌ హీరోయిన్‌గా వెలుగొంది బాలీవుడ్‌కి వెళ్లిన ముద్దుగుమ్మ ఇలియానా. టాలీవుడ్‌ని విడిచి వెళ్లాక, తెలుగు సినిమాని ఎంతగా అవమానించాలో అంతగా అవమానించింది. తనకు సక్సెస్‌ కట్టబెట్టింది ఆ తెలుగు సినిమానే అన్న సంగతి మర్చిపోయి, తెలుగు సినిమా పైనా, తెలుగు దర్శక, నిర్మాతలపైనా ఇలియానా చాలా విమర్శలు గుప్పించింది. 

అలాంటిది బాలీవుడ్‌లో అవకాశాలు కరువయ్యేసరికి మళ్లీ తెలుగు సినిమా గుర్తొచ్చినట్లుంది. తెలుగులో అవకాశాల కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది గత కొంత కాలంగా. తాజాగా రవితేజ సినిమాలో ఇలియానాని హీరోయిన్‌గా ఎంపిక చేసుకున్నారనీ అధికారికంగా ప్రకటన వెల్లడైంది. ఈ సినిమాలో మొదట అనూ ఇమ్మాన్యుయేల్‌ని అనుకున్నారు. అయితే అనూహ్యంగా ఆమె ఈ సినిమా నుండి తప్పుకోవడంతో ఆ ప్లేస్‌లో శృతిహాసన్‌ని కూడా అనుకున్నారు. కానీ చిట్ట చివరికి ఇలియానా పేరు అఫీషియల్‌గా డిక్లర్‌ చేసేశారు. అయితే తెలుగు సినిమాని అవమానించిన ఇలియానాని మళ్లీ ఎందుకు తీసుకొస్తున్నారు అని ఓ వర్గం నుండి విమర్శలు వస్తున్నాయి. 

వాస్తవానికి ప్రస్తుతం ఇలియానా సక్సెస్‌లో లేదు. అందులోనూ రవితేజతో ఇలియానాకి ‘కిక్‌’ తప్ప మరో సక్సెస్‌ లేదు. చేసినవి మూడు సినిమాలైనా, కిక్‌ తప్ప, మరో రెండు సినిమాలైన ‘ఖతర్నాక్‌’, ‘దేవుడు చేసిన మనుషులు’ డిజాస్టర్స్‌ లిస్ట్‌లోకే వెళతాయి. అలాంటిది అసలే టైం అంతంత మాత్రంగా ఉన్న రవితేజ ఈ సినిమా కోసం ఇలియానాని తీసుకోవడంలో అంతరార్ధం ఏంటో సినిమా విడుదలైతే కానీ తెలీదంతే.!

You May Like This
- Advertisment -spot_img

Most Popular