HomeMovie News Teluguమెగా ప్రిపరేషన్స్‌లో మెగా పవర్‌స్టార్‌

మెగా ప్రిపరేషన్స్‌లో మెగా పవర్‌స్టార్‌

రెండు పడవల మీద ప్రయాణం మంచిది కాదనీ, అలవోకగా చెప్పేస్తూ ఉంటాం. కానీ రామ్‌చరణ్‌కి అది అలవాటైన విద్యే. నిర్మాతగా తండ్రి చిరంజీవితో ‘ఖైదీ నెంబర్‌ 150’ సినిమా నిర్మించి హిట్‌ కొట్టిన ఈ మెగా బుల్లోడు, అదే టైంలో హీరోగా చేసిన ‘ధృవ’ సినిమాతో సత్తా చాటాడు. ఇప్పుడు చరణ్‌ – బోయపాటి శీను దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. 

మరో పక్క నిర్మాతగా, ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా చేస్తున్నాడు. అటు నిర్మాతగా, ఇటు హీరోగా దాదాపు ఒకేసారి హిట్లు కొట్టడం చరణ్‌ ప్రత్యేకత. ఆ మ్యాజిక్‌ ఇంకోసారి ఖచ్చితంగా వర్కవుట్‌ అవుతుందనీ బోయపాటి డైరెక్షన్‌లో తాను చేయబోయే సినిమాతో పాటుగా, సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా రూపొందుతోన్న ‘సైరా’ కూడా బంపర్‌ హిట్‌ అవుతుందని తిరుగులేని నమ్మకంతో ఉన్నాడు చరణ్‌. 

తండ్రికి పుట్టినరోజు బహుమతిగా ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా టీజర్‌ని విడుదల చేయాలని ఆ సినిమా నిర్మాతగా చరణ్‌ అనుకుంటున్నాడనీ తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ సినిమాలో చరణ్‌ గెస్ట్‌ అప్పియరెన్స్‌ ఇస్తాడట. 

ఇది కాకుండా చిరంజీవి నటించబోయే యాక్షన్‌ సీక్వెన్సెస్‌కి సంబంధించి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశాడట. తండ్రి భద్రత విషయంలో చరణ్‌ ప్రిపరేషన్స్‌కి ఎవరైనా హేట్సాఫ్‌ చెప్పాల్సిందే.

You May Like This
- Advertisment -spot_img

Most Popular