HomeMovie News Teluguసమంతను మార్చేసిన 'మహానటి'

సమంతను మార్చేసిన ‘మహానటి’

అందాల భామ సమంత తెలుగులో బాగా మాట్లాడుతుంది. కానీ ఇంతవరకూ తెరపై కనిపించిన సమంత పాత్రకు ప్రముఖ గాయని, డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌ అయిన చిన్మయి వాయిసే వినిపించింది. 

అయితే ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘మహానటి’ చిత్రంలో సమంత కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఈ పాత్రకు తానే స్వయంగా డబ్బింగ్‌ చెప్పుకుంది సమంత. అసలే ఎంతో ప్రత్యేకమైన సినిమా ‘మహానటి’. తెరపై తాను కనిపించడంతో పాటు, వినిపించేది కూడా తన సొంత గొంతే అని గుర్తు చేసుకున్నప్పుడల్లా సమంతకు ఎక్కడ లేని ఆనందం ఉబికి వచ్చేస్తోందట. అందుకే ఈ ఆనందాన్ని ఇకపై వరుసగా పొందాలనే భావనలో సమంత ఉన్నట్లు తెలుస్తోంది. అంటే ఇక నుండి సమంత తన పాత్రకు తానే డబ్బింగ్‌ చెప్పుకోవాలనుకుంటోందట.

ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో వరుస సినిమాలతో బిజీగా ఉన్న సమంత, డబ్బింగ్‌కి కూడా డేట్స్‌ అడ్జస్ట్‌ చేసుకుంటోందట. ఆల్రెడీ తమిళంలో ‘సూపర్‌ డీలక్స్‌’ చిత్రానికి సమంతే డబ్బింగ్‌ చెప్పుకుంటోందట. అలాగే ఇకపై తెలుగు సినిమాలకూ కూడా తన సొంత గొంతునే వినిపించాలని డిసైడ్‌ అయిపోయిందట. ఇప్పుడు చాలా మంది ముద్దుగుమ్మలు తమ సొంత గొంతును వినిపించేందుకే ఇష్టపడుతున్నారు.

పెళ్లి తర్వాత సమంతలో వచ్చిన పెద్ద మార్పు ఇది. అంతేకాదు, గ్లామరస్‌ పాత్రలకు కూడా సమంత ఇకపై దూరంగా ఉండాలనుకుంటోందనీ చూచాయగా తెలుస్తోంది. ఈ విషయమైతే కాస్త ఆలోచించాల్సిందే..కానీ చూడాలిక సమంత అక్కినేని ఏం చేస్తుందో మరి.

You May Like This
- Advertisment -spot_img

Most Popular