HomeMovie News Teluguవేశ్య గా మారిన అల్లు అర్జున్ హీరోయిన్..!

వేశ్య గా మారిన అల్లు అర్జున్ హీరోయిన్..!

‘వేశ్య పాత్రలో లోతైన భావోద్వేగాలుంటాయి..ఆ పాత్రలో నటించే అవకాశమొస్తే ఖచ్చితంగా నటిస్తాను. అని ఇటీవల బుల్లితెర యాంకర్‌ కమ్‌ నటి రేష్మి చెప్పింది. కానీ ఇప్పుడా అవకాశం మరో హాట్‌ బ్యూటీ శ్రద్దాదాస్‌కి వచ్చింది. 

హీరోయిన్‌గా నిలదొక్కుకోవడానికి ఉండాల్సిన అన్ని షేడ్స్‌ ఈ పాపలో ఉన్నా, పాపం ముద్దుగుమ్మ శ్రద్దాదాస్‌కి దాన్ని నిరూపించుకునే అవకాశమే రావడం లేదు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో పలు చిత్రాల్లో నటిస్తున్నప్పటికీ, ఎక్కడా ఆమెకు చెప్పుకోదగ్గ స్థాయిలో గుర్తింపు దక్కడం లేదు. అయితే ఇప్పుడు శ్రద్ధాదాస్‌ ట్రాక్‌ మార్చేసింది.  

ఈ మధ్య షార్ట్‌ఫిల్మ్స్‌తో కూడా పలువురు నటీనటులు బాగా పాపులర్‌ అవుతున్నారు. అందుకే ఈ ముద్దుగుమ్మ బిగ్‌ స్క్రీన్‌ నుండి, షార్ట్‌ స్క్రీన్‌ వైపు అడుగులు కదుపుతోంది. ‘శృంగార్‌ దాన్‌’ అనే ఓ షార్ట్‌ఫిల్మ్‌లో శ్రద్ధాదాస్‌ నటిస్తోంది. ఈ షార్ట్‌ ఫిల్మ్‌లో శ్రద్దా ‘షాయిబా’ అనే ఓ వేశ్య పాత్రలో నటిస్తుండడం విశేషం. ఈ పాత్ర గురించి శ్రద్దా కూడా అచ్చం రేష్మీ ఎలా చెప్పిందో అలాగే చెబుతోంది. ఈ పాత్రలో చాలా భావోద్వేగాలుంటాయి. 

నటిగా పరిణితి చెందాలంటే ఈ తరహా పాత్రల్లో కనిపిస్తేనే సాధ్యపడుతుంది. తనకీ పాత్ర మంచి పేరు తీసుకొస్తుందనీ, షార్ట్‌ ఫిల్మ్‌ కదా అని తక్కువంచనా వేయడానికి లేదు అని శ్రద్దా చెబుతోంది. మొత్తానికి రేష్మీ కలను ఈ రకంగా శ్రద్దాదాస్‌ నెరవేర్చుకుంటోందన్న మాట. వేశ్య పాత్రలో నటించాలన్న రేష్మీ కల నెరవేరాలంటే, ఆమె కూడా ఏ షార్ట్‌ఫిలింనో నమ్ముకుంటే మంచిదేమో.!

You May Like This
- Advertisment -spot_img

Most Popular