HomeMovie News Teluguఈ కుర్రాడు సమ్‌థింగ్‌ స్పెషల్‌.!

ఈ కుర్రాడు సమ్‌థింగ్‌ స్పెషల్‌.!

మలయాళ సూపర్‌ స్టార్‌ మమ్ముట్టి కుమారుడు దుల్కర్‌ సల్మాన్‌ తెలుగు ప్రేక్షకులకూ సుపరిచితుడే. గతంలో ‘ఓకే బంగారం’ సినిమాతో తెలుగు ఆడియన్స్‌కి దగ్గరయ్యాడు. ‘మహానటి’తో ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చాడు. సినిమా మంచి విజయం అందుకుంది. దుల్కర్‌కి మంచి పేరొచ్చింది. ఇదిలా ఉండగా ఈ యంగ్‌ అండ్‌ ఎనర్జిటిక్‌ హీరో లేటెస్టుగా హిందీలో ఓ సినిమా చేస్తున్నాడు. ‘కార్వాన్‌’ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ని తాజాగా విడుదల చేసింది చిత్ర యూనిట్‌.

దుల్కర్‌ సల్మాన్‌తో పాటు, ఇర్ఫాన్‌ ఖాన్‌, మిథిలా పాల్కర్‌ ఈ సినిమాలో ఇతర ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు. ఈ ముగ్గురు కలిసి కొబ్బరి బొండాలు తాగుతున్నట్లుగా ఉన్న ఈ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ సమ్‌థింగ్‌ ఇంట్రెస్టింగ్‌గా ఉంది. వీరి పక్కనే ఓ కారు పార్క్‌ చేసి ఉంది పోస్టర్‌లో. ఇంతకీ ఈ సినిమా కాన్సెప్ట్‌ ఏంటంటారా? ‘త్రీ లాస్ట్‌ సోల్స్‌ టూ డెడ్‌ బోడీస్‌ ఎ జర్నీ ఆఫ్‌ లైఫ్‌ టైమ్‌’. ఇదీ ఈ సినిమా కాన్సెప్ట్‌ అన్న మాట. జర్నీ నేపథ్యంలో సాగే చిత్రమిది అని పోస్టర్‌నీ, కాన్సెప్ట్‌నీ బట్టి తెలుస్తోంది.

ముగ్గురు విభిన్న మనస్తత్వాలున్న వ్యక్తులు, వారి ప్రయాణానికి సంబంధించి ఈ సినిమాలో చూపించనున్నారట. ప్రతీ సన్నివేశం చాలా హృద్యంగా తెరకెక్కించనున్నారట డైరెక్టర్‌ ఆకాష్‌ ఖురానా. ఆగష్టు 10న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రాన్ని రోనీ స్క్రూవాలా నిర్మించారు. కాన్సెప్ట్‌ బేస్‌డ్‌ మూవీస్‌ బాగా సక్సెస్‌ అవుతున్న ఈ తరుణంలో దుల్కర్‌ సల్మాన్‌ నటిస్తున్న ఈ ‘కార్వాన్‌’ చిత్రం ఎంత మేర సక్సెస్‌ అవుతుందో చూడాలిక.

You May Like This
- Advertisment -spot_img

Most Popular