HomeMovie News Teluguఅక్కినేని కోడలా మజాకానా!

అక్కినేని కోడలా మజాకానా!

‘రంగస్థలం’లో రామలక్ష్మిగా అందరి మనసులు దోచుకున్న సమంత, నెక్ట్స్‌ వరుస సినిమాలతో రెడీగా ఉంది. ఈ ఏడాదే సమంత నుండి రెండు మూడు సినిమాలు వచ్చేయనున్నాయి. వాటిలో మొదటిది ‘మహానటి’. అలనాటి మేటి నటి సావిత్రి జీవితాధారంగా తెరకెక్కుతోన్న చిత్రం ‘మహానటి’. 

ఈ సినిమాలో కీర్తి సురేష్‌ లీడ్‌ రోల్‌ పోషిస్తుండగా, సమంత కీలక పాత్ర పోషిస్తోంది. ఆ కాలంలోని జర్నలిస్ట్‌గా సమంత కనిపించనుంది ఈ సినిమాలో. ఈ సినిమా సంగతి అటుంచితే, కన్నడలో ఘన విజయం సాధించిన ‘యూ టర్న్‌’ చిత్రం తెలుగులో అదే టైటిల్‌తో తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలోనూ సమంతది యాక్టింగ్‌కి స్కోపున్న పాత్రే. అది కూడా జర్నలిస్ట్‌ పాత్రే. అయితే ‘మహానటి’లోని జర్నలిస్ట్‌కీ, ‘యూ టర్న్‌’లోని జర్నలిస్ట్‌ పాత్రకీ చాలా వేరియేషన్‌ ఉంటుందట. 

‘యూ టర్న్‌’లో సమంతతో పాటు, ఆది పినిశెట్టి, రాహుల్‌ రవీంద్రన్‌ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఒరిజినల్‌ని తెరకెక్కించిన పవన్‌ కుమార్‌ తెలుగు, తమిళ భాషల్లోనూ తెరకెక్కిస్తున్నారు. విశాల్‌తో సమంత నటిస్తున్న ‘అభిమన్యు’ చిత్రంలో కూడా హుందా అయిన పాత్రలోనే కనిపించనుంది సమంత. 

ఏది ఏమైనా పెళ్లి తర్వాత సమంత, డిఫరెంట్‌ క్యారెక్టర్స్‌, డిఫరెంట్‌ కాన్సెప్ట్‌ మూవీస్‌తో విశేషంగా ఆకట్టుకుంటోంది. గ్లామర్‌ తారగా స్టార్‌ హీరోయిన్‌గా వెలుగొందిన సమంత, ఇప్పుడు యాక్టింగ్‌కి స్కోపున్న పాత్రలనే ఎంచుకుంటోంది. పెళ్లి తర్వాత కూడా హీరోయిన్‌గా నటించి, బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ కొట్టింది ‘రంగస్థలం’తో. ఇక రానున్న సినిమాలతో మరెన్ని సక్సెస్‌లు తన ఖాతాలో వేసుకుంటుందో సమంత చూడాలి మరి.

You May Like This
- Advertisment -spot_img

Most Popular