HomeMovie News Teluguచెప్పుతో కొట్టుకున్న శ్రీరెడ్డి

చెప్పుతో కొట్టుకున్న శ్రీరెడ్డి

గత రెండు నెలలుగా సినీ ప్రముఖులపై అసభ్యకరమైన ఆరోపణలతో టాలీవుడ్‌లో ప్రకంపనలు సృష్టిస్తోన్న నటి శ్రీ రెడ్డి ఇప్పుడు పవన్‌ కళ్యాణ్‌ మీదా, పవన్‌ ఫ్యాన్స్‌ మీదా విరుచుకుపడింది. శ్రీరెడ్డి ఆరోపణల దృష్ట్యా ఇటీవల పవన్‌ కళ్యాణ్‌ స్పందించిన సంగతి తెలిసిందే. 

శ్రీరెడ్డి తనకు జరిగిన అన్యాయం దృష్ట్యా పోలీసులనాశ్రయిస్తే తనకు తగిన న్యాయం జరుగుతుందనీ, అంతేకానీ, మీడియాలో ఇలా ఆరోపణలు చేయడం వల్ల ఉపయోగం లేదని అన్నారు. ఆ మాటలకు శ్రీరెడ్డి స్ట్రాంగ్‌గా కౌంటర్‌ ఇచ్చింది. పవన్‌ కళ్యాణ్‌పై దారుణమైన విమర్శలు గుప్పిస్తూ పవన్‌ కళ్యాణ్‌ని ‘అన్నా’ అని సంబోధించినందుకు తన చెప్పుతో తాను కొట్టుకుంటున్నానని మీడియా ముందే కొట్టుకుని చూపించింది. ఇకపై ఏ అమ్మాయి పవన్‌ కళ్యాణ్‌ని అన్నా అని పిలవద్దనీ పిలుపునిచ్చింది. 

మూడు పెళ్లిళ్లు చేసుకున్న పవన్‌ కళ్యాణ్‌ ప్రజా నాయకుడు కాదనీ ‘మా…ధ్‌..’ అని మిడిల్‌ ఫింగర్‌ పైకి చూపించింది. పవన్‌ కళ్యాణ్‌కి ఎవ్వరూ ఓటేయద్దనీ అల్టిమేటం జారీ చేసింది. అంతేకాదు, పవన్‌పై చేస్తున్న విమర్శలకు ఆల్రెడీ సోషల్‌ మీడియాలో శ్రీరెడ్డికి ట్రోలింగ్‌ స్టార్ట్‌ అయిపోయింది. ఆ ట్రోలింగ్‌ ఆపేందుకు పవన్‌ తన అభిమానులకు రహస్యంగా కానీ, బహిరంగంగా కానీ ఎలాగైతే అలా వార్నింగ్‌ ఇచ్చి, వారి నోరు మూయించాలనీ వార్నింగ్‌ ఇచ్చింది శ్రీరెడ్డి. 

స్టూడియోలు తనలాంటి అమ్మాయిల్ని వాడుకుని వదిలేస్తున్నాయనీ ఇంకా పలు రకాల విమర్శలు చేసింది శ్రీరెడ్డి. ‘మా’ నుండి బ్యాన్‌ రద్దయ్యాక కొన్ని రోజులు శ్రీరెడ్డి కామ్‌ అయ్యిందనుకుంటే, ఇప్పుడు మళ్లీ పవన్‌ ఇష్యూతో రైజ్‌ అయ్యినట్లు కనిపిస్తోంది. చూడాలికి శ్రీరెడ్డి ఈ పాత్‌లో ఇంకెంత దూరం వెళుతుందో.!

You May Like This
- Advertisment -spot_img

Most Popular