HomeMovie News Teluguరకుల్‌ అలా కాజల్‌ ఇలా.!

రకుల్‌ అలా కాజల్‌ ఇలా.!

ఒక్కోసారి ప్రచారమయ్యే గాసిప్స్‌ అనుకోకుండా నిజమవుతాయి. కానీ చాలాసార్లు గాసిప్స్‌ గాసిప్స్‌లాగానే ఉండిపోతాయి. మరికొన్ని సందర్భాల్లో సదరు వ్యక్తులు స్పందించడం ద్వారా క్లారిటీ వస్తుంది. అలాగే ఇప్పుడు రెండు తాజా గాసిప్స్‌ ట్రెండింగ్‌లో ఉన్నాయి. 

బాలయ్య ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న ‘ఎన్టీఆర్‌’ చిత్రంలో చందమామ కాజల్‌ అగర్వాల్‌ ఓ కీలకపాత్రలో నటిస్తోందంటూ గాసిప్స్‌ వచ్చాయి. ఆ పాత్ర పేరు కూడా ప్రచారంలో ఉండడంతో కాజల్‌ ఈ విషయంలో వెంటనే స్పందించి, క్లారిటీ ఇచ్చేసింది. తాను ఆ పాత్రలో నటించడం లేదంటూ కాజల్‌ చెప్పేసింది. ఇంతకీ ఆ పాత్రేంటంటారా? అలనాటి నటి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి అయిన దివంగత నేత జయలలిత పాత్రలో కాజల్‌ నటిస్తోందంటూ గాసిప్‌ వచ్చింది. అలాంటిదేమీ లేదని కాజల్‌ ఖండించింది. 

మరో వైపు నాగ చైతన్య హీరోగా తెరకెక్కుతోన్న ‘సవ్యసాచి’ చిత్రంలో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఐటెం సాంగ్‌లో నటిస్తోందంటూ మరో గాసిప్‌ ప్రచారమైంది. ‘రారండోయ్‌ వేడుక చూద్దాం’ సినిమాలో చైతూ, రకుల్‌ ప్రీత్‌సింగ్‌ జంటగా నటించారు. ఆ పరిచయంతోనే రకుల్‌, చైతూ కోసం ఈ సినిమాలో స్పెషల్‌ సాంగ్‌ చేసేందుకు ఒప్పుకుందంటూ జోరుగా ప్రచారం సాగింది. అయితే ఆ విషయాన్ని రకుల్‌ ఖండించింది. 

ఆ రకంగా ఈ ఇద్దరు ముద్దుగుమ్మల విషయంలో స్ప్రెడ్‌ అయిన గాసిప్స్‌ కామ్‌అప్‌ అయిపోయాయి. రకుల్‌ ఇప్పుడు తమిళంలో వరుస సినిమాలతో బిజీగా ఉంది. కాజల్‌ తమిళంలో ‘ప్యారిస్‌ ప్యారిస్‌’ చిత్రంలోనూ, తెలుగులో శర్వానంద్‌ – సుధీర్‌ వర్మ కాంబినేషన్‌లో వస్తున్న సినిమాలోనూ నటిస్తోంది.

You May Like This
- Advertisment -spot_img

Most Popular