HomeMovie News Teluguఅలా అనేస్తే ఎలా జిగేల్‌ రాణీ.!

అలా అనేస్తే ఎలా జిగేల్‌ రాణీ.!

‘జిల్‌ జిల్‌ జిగేల్‌ రాణీ..’ అంటూ రంగస్థలంలో స్పెషల్‌ సాంగ్‌ కోసం జోరు జోరు స్టెప్పులేసింది ముద్దుగుమ్మ పూజా హెగ్దే. సినిమా మంచి విజయం అందుకుంది. ‘జిగేల్‌ రాణీ..’ పాటకు సూపర్బ్‌ రెస్పాన్స్‌ వచ్చింది. ఈ సాంగ్‌ తర్వాత పూజా హెగ్దేని మరో ఐటెం సాంగ్‌ ఎప్పుడు అని అడుగుతున్నారట ఫ్యాన్స్‌. 

అందుకు పూజా హెగ్దే చెబుతున్న మాటేంటంటే, ‘ఇప్పట్లో ఐటెం సాంగ్స్‌ చేయను. జిగేల్‌ రాణీ..లాంటి అవకాశాలు చాలా అరుదుగా వస్తాయి. అలా వచ్చిన అవకాశాల్ని స్వీట్‌ మెమరీస్‌గా కొన్నాళ్లు గుర్తుంచుకోవాలి. ప్రస్తుతం సినిమా సక్సెస్‌ని ఎంజాయ్‌ చేస్తున్నాను. అలా అని ఐటెం సాంగ్స్‌ చేయనని చెప్పలేను కానీ, కొంచెం గ్యాప్‌ తీసుకుంటాను..’ అని పూజా అంటోంది. మరో పక్క ఆమె హీరోయిన్‌గా చేయాల్సిన ప్రాజెక్ట్స్‌ చాలా ఉన్నాయి. అవన్నీ ప్రెస్టీజియస్‌ ప్రాజెక్టులే. స్టార్‌ హీరోలతో జత కడుతోంది. ఎన్టీఆర్‌, ప్రబాస్‌, మహేష్‌ వంటి హీరోలతో పూజాహెగ్దే జత కట్టనుంది. 

ఈ టైంలో ఐటెం సాంగ్‌ గురించి ఆలోచించే మూడ్‌ లేదనీ పూజా చెబుతోంది. అంతేకాదు, సుకుమార్‌ ‘రంగస్థలం’లోని స్పెషల్‌ సాంగ్‌ గురించి చెప్పిన్పుడు తెలియని ఏదో కొత్త అనుభూతికి లోనయ్యాను. అందుకే ఆ సాంగ్‌లో నటించడానికి వెంటనే ఓకే చెప్పేసానని పూజా అంటోంది. ఏమాటకామాటే చెప్పాలి, ఫస్ట్‌ ఐటెం సాంగ్‌ అయినప్పటికీ, ‘జిగేల్‌రాణీ సాంగ్‌లో చరణ్‌తో కలిసి పూజా వేసిన ఫాస్ట్‌ స్టెప్పులు కానీ, లిరిక్స్‌కి తగ్గట్లుగా ఆమె ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్‌ కానీ వర్ణించేందుకు మాటలు చాలవంతే!

You May Like This
- Advertisment -spot_img

Most Popular