HomeMovie News Teluguవైఎస్ఆర్ భార్యగా లేడీ సూపర్ స్టార్!

వైఎస్ఆర్ భార్యగా లేడీ సూపర్ స్టార్!

ప్రస్తుతం తెలుగు చలనచిత్ర పరిశ్రమలో బయోపిక్ ట్రెండ్ నడుస్తున్నది. ఇప్పటికే ఎన్టీఆర్ బయోపిక్ కి సంబంధించి పలు వార్తలు వస్తుండడం అలాగే ఆయన జీవితం పైన మరిన్ని చిత్రాలు రానున్నాయి. 

ఇక ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ జీవితం పైన కూడా ఒక బయోపిక్ రూపొందనుంది. ఇందులో వైఎస్ఆర్ పాత్రలో మలయాళ సూపర్ స్టార్ మమ్మూట్టి నటించనున్నారు అని వార్తలు వస్తుండడం అయితే వాటికి సంబంధించి అధికారిక ప్రకటన ఏమి రాలేదు. 

ఇదిలావుండగా ఇప్పుడు ఆ చిత్రంలో వైఎస్ఆర్ భార్య విజయలక్ష్మి పాత్రలో ఒక ప్రముఖ నటి నటిస్తున్నది అన్న వార్త బయటకి వచ్చింది. ఆ నటి మరెవరో కాదు తమిళ సూపర్ స్టార్ నయనతార. అయితే ఈ పాత్ర పైన కూడా ఇంకా ఎటువంటి ప్రకటన రాలేదు. 

చూద్దాం.. త్వరలోనే ఈ చిత్రం తాలుకా అధికారిక ప్రకటన వస్తుందేమో..  

You May Like This
- Advertisment -spot_img

Most Popular