HomeMovie News Teluguనాన్న, నేను ఓ రాజకీయం: శృతిహాసన్‌

నాన్న, నేను ఓ రాజకీయం: శృతిహాసన్‌

తమిళ నటుడు కమల్‌ హాసన్‌ రాజకీయాల్లోకి తెరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ నెల 21 నుండి ఆయన తమిళనాడులో పర్యటించనున్నారు. ప్రజలతో మమేకం కానున్నారు. ఆ దిశగా పలువురు రాజకీయ ప్రముఖులను కమల్‌ కలవనున్నారు. ఈ బుధవారం ఆయన తన రాజకీయ పార్టీకి సంబంధించిన కీలక ప్రకటన చేయనున్నారు. మధురైలో పార్టీ పేరును ప్రకటించనున్నారు. 

ఈ సందర్భంగా కమల్‌ హాసన్‌ కుమార్తై అయిన శృతిహాసన్‌ ట్విట్టర్‌లో స్పందించారు. ‘నాకు రాజకీయాల గురించి ఏమీ తెలియదు. కానీ నాన్న రాజకీయాల్లోకి వచ్చినందుకు ఓ కూతురుగా గర్వంగా ఉంది. ఆయన రాజకీయ ప్రయాణంలో నేను ఎప్పుడూ తోడుంటాను. ఆయనకే పూర్తి మద్దతిస్తాను. రాజకీయాలపై అవగాహన లేకుండా ఇంతకన్నా ఎక్కువ మాట్లాడలేను. కానీ ఓ కూతురుగా ఆయనకే నా ఫుల్‌ సపోర్ట్‌..’ అని శృతిహాసన్‌ తెలిపింది. 

ఇకపోతే ఈ బుధవారం రామనాధపురంలో ఓ బహిరంగ సభను ఏర్పాటు చేసి, తన రాజకీయ పార్టీ అజెండా ఏంటో కమల్‌ వివరించనున్నారు. అసలు తను రాజకీయాల్లోకి రావల్సిన అవసరం ఏంటి? రాజకీయాల్లో ఆయన ఏం చేయబోతున్నారు అనే విషయాలపై కమల్‌ వివరణ ఇవ్వనున్నారు. ఆ తర్వాత రామేశ్వరంలోని దివంగత మాజీ రాష్ట్రపతి అబ్ధుల్‌ కలాం నివాస గృహాన్ని ఈ సందర్భంగా కమల్‌ సందర్శించనున్నారు. 

అనంతరం ఆయన సమాధి వద్ద నివాళులు అర్పించనున్నారు. కమల్‌హాసన్‌ రాజకీయాల్లోకి రావడానికి ఆయన కుమార్తెలు శృతిహాసన్‌, అక్షర హాసన్‌ ఎంతో కష్టపడ్డారనీ, ముఖ్యంగా తండ్రికి రాజకీయాల్లో అక్షర హాసన్‌ ప్రత్యక్షంగా సహాయ పడనుందని సమాచారమ్‌.

You May Like This
- Advertisment -spot_img

Most Popular