HomeMovie News Teluguఎన్టీఆర్‌ కాకుంటే బిగ్‌బాస్‌ ఎవరితో?

ఎన్టీఆర్‌ కాకుంటే బిగ్‌బాస్‌ ఎవరితో?

గతేడాది బుల్లితెర బిగ్‌ షోగా ప్రసారమైన ‘బిగ్‌బాస్‌’ షో ఎంతగా ప్రేక్షకాదరణ పొందిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఈ షో ఇంత గ్రాండ్‌ సక్సెస్‌ కావడానికి కారణం ఈ షోకి యాంకర్‌గా వ్యవహరించిన యంగ్‌ టైగర్‌ ఎన్టీఆరే. ఎన్టీఆర్‌ తన నటనా నైపుణ్యాన్ని అంతా రంగరించి, స్టేజ్‌పై తనదైన శైలితో తొలి సారి యాంకరింగ్‌ అయినా చితక్కొట్టేశాడు. వీకెండ్స్‌లోనే ఎన్టీఆర్‌ ఎంట్రీ ఉండినా కానీ, వీక్‌ మొత్తం ఆ ఎఫెక్ట్‌ ఉండడంతో పాటు, వీకెండ్స్‌లో టీఆర్‌పీ రేటింగ్స్‌ అమాంతం పెరిగిపోయేవి ఎన్టీఆర్‌ రాకతో. ఇదంతా బాగానే ఉంది. 

మరి త్వరలో ‘బిగ్‌బాస్‌’ సెకండ్‌ సీజన్‌ స్టార్ట్‌ కానుందట. మరి ఈ సీజన్‌లో కూడా ఎన్టీఆరే వ్యాఖ్యాతగా వ్యవహరిస్తాడా అంటే ప్రస్తుతానికి సస్పెన్సే. బిగ్‌బాస్‌ తొలి సీజన్‌ టైంలో ఎన్టీఆర్‌కి అన్నీ అలా కలిసొచ్చేశాయి. బిగ్‌బాస్‌ షూటింగ్‌ పూనేలో జరగడం, అప్పుడు ఎన్టీఆర్‌ చేస్తున్న ‘జై లవకుశ’ షూటింగ్‌ కూడా పూనే పరిసర ప్రాంతాల్లో జరుగడంతో రెండింటినీ ఎన్టీఆర్‌ మేనేజ్‌ చేయగలిగాడు. కానీ ఇప్పుడు పరిస్థితి వేరే. ప్రస్తుతం ఎన్టీఆర్‌ చేతిలో రెండు బిగ్‌ అండ్‌ ప్రెస్టీజియస్‌ ప్రాజెక్టులున్నాయి. అందులో ఒకటి త్రివిక్రమ్‌తో చేయబోయే సినిమా ఒకటి. మరోటి రాజమౌళి మల్టీ స్టారర్‌. అయితే వీటిలో రాజమౌళి సినిమా ఇంకా ఎప్పుడు పట్టాలెక్కుతుందో తెలీదు కానీ, త్రివిక్రమ్‌ సినిమా మార్చి నుండి రెగ్యులర్‌ షూటింగ్‌ స్టార్ట్‌ కానుంది. 

ఈ తరుణంలో ‘బిగ్‌బాస్‌’ నిర్వాహకులు ఎన్టీఆర్‌ కోసం ఎలాంటి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారో చూడాలి. తన అల్లరి చేష్టలతో చురుక్కు చమక్కు మాటలతో బుల్లితెర ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకున్న ఎన్టీఆర్‌ మరి బిగ్‌బాస్‌ 2′ కి కూడా తానే యాంకరింగ్‌ చేస్తారా? ఒకవేళ ఎన్టీఆర్‌ కాకపోతే ఆ ప్లేస్‌ని ఆ స్థాయిలో భర్తీ చేసేదెవరు? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.

You May Like This
- Advertisment -spot_img

Most Popular