HomeMovie News Teluguతమన్నా ఆ విషయంలో బాగా హర్టయ్యింది..!

తమన్నా ఆ విషయంలో బాగా హర్టయ్యింది..!

బహిరంగ వేడుకలకు హాజరైనప్పుడు సెలబ్రిటీస్‌కి స్వీట్‌ మెమరీస్‌తో పాటు, అప్పుడప్పుడూ చేదు అనుభవాల్ని కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. తాజాగా మిల్కీ బ్యూటీకి ఈ మధ్య ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. మొన్న హైద్రాబాద్‌లో జరిగిన ఓ ప్రారంభోత్సవ వేడుకకు తమన్నా ముఖ్య అతిథిగా విచ్చేసింది. ఆ కార్యక్రమంలో ఓ కుర్రాడు మిల్కీ బ్యూటీ తమన్నాపై షూ విసిరాడు. 

ఈ ఘటనపై వెంటనే స్పందించిన పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. ఈ విషయంపై తమన్నా తాజాగా స్పందించింది. సెలబ్రిటీస్‌కి ఇలాంటి అనుభవాలు ఎదురౌతుంటాయి కామనే. కానీ ఈ అనుభవం తనని ఎంతో బాధకి గురయ్యేలా చేసిందనీ తమన్నా చెబుతోంది. ఎప్పుడూ పూలే కాదు, అప్పుడప్పుడూ ఇలాంటివి కూడా సెలబ్రిటీస్‌ ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే అభిమానులను కంట్రోల్‌ చేయడం కూసింత కష్టమైన పనే. కానీ తగినంత పోలీస్‌ సెక్యూరిటీ, భద్రతా ఏర్పాట్లు చేస్తే సదరు యాజమాన్యాలు సెలబ్రిటీస్‌ని ఆహ్వానించకూడదు. ఈ చేదు అనుభవంతో ప్రారంభోత్సవాలకు వెళ్లినప్పుడు, ఇకనుంచి సెక్యూరిటీ విషయంలో జాగ్రత్త తీసుకోవాలని నిర్ణయానికి వచ్చిందట మిల్కీ బ్యూటీ తమన్నా. 

ఫుల్‌ సెక్యూరిటీ కల్పిస్తామనే హామీతో పాటు, పోలీస్‌ అధికారుల సూచనలు కూడా తీసుకునే ఇకపై ఇలాంటి ప్రారంభోత్సవాల్లో పాల్గొనాలని గట్టిగానే తమన్నా నిర్ణయించుకుందనీ తెలుస్తోంది. ఇదిలా ఉండగా, ప్రస్తుతం మన మిల్కీ బ్యూటీ బాలీవుడ్‌ ‘క్వీన్‌’ తెలుగు రీమేక్‌లో నటిస్తోంది. మరోపక్క కళ్యాణ్‌రామ్‌తో తమన్నా నటించిన ‘నా నువ్వే’ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధంగా ఉంది.

You May Like This
- Advertisment -spot_img

Most Popular