HomeMovie News Teluguచిట్టిబాబుకు తగ్గ జోడీలే రామలక్ష్మీ

చిట్టిబాబుకు తగ్గ జోడీలే రామలక్ష్మీ

‘రంగస్థలం’ సినిమాలో రామ్‌ చరణ్‌ సరసన సమంత నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా చిత్ర యూనిట్‌ ఈ సినిమాలో సమంత పాత్రకి సంబంధించిన టీజర్‌ని విడుదల చేసింది. టీజర్‌లో సమంత వయ్యారం అహో..! చెప్పేందుకు మనకు మాటలు చాలవు గానీ.. అందుకే చిట్టిబాబు మాటల్లోనే ఈ ముద్దుగుమ్మ వయ్యారాన్ని వర్ణించేశారు టీజర్‌లో. 

అహా ఏం వయ్యారం..ఏం వయ్యారం ఏమాటకామాటే సెప్పుకోవాలండీ. ఈ పిల్ల ఎదురొత్తుంటే ఊరికి 18 ఏళ్లు వయసొచ్చేసినట్టుంటుంది.. ఈ పిల్లేనండీ ఈ చిట్టిగాడి గుండెని గోలట్టించేసింది.. పేరు రామలక్ష్మండీ.. ఊరు..అంటుండగా రంగా.. రంగస్థలాన అనే బ్యాక్‌ గ్రౌండ్‌ మ్యూజిక్‌తో ఆహా ఏం వర్ణించాడండీ చిట్టిబాబు అనిపిస్తోంది కదా. అసలు సిసలు పల్లెటూరి పడుచు అందాలతో సమంత భలే మ్యాచ్‌ అయిపోయిందిలే. కట్టూ, బొట్టూ, ముక్కుకు ముక్కెరా స్వచ్ఛమైన నవ్వు.. ‘రామలక్ష్మి’ పాత్రలో అచ్చం పల్లెటూరి అమ్మాయిలా చాలా అందంగా ఉంది సమంత. 

నిజంగానే కెరీర్‌ బెస్ట్‌ క్యారెక్టర్‌ ఇది సమంతకి అనడంలో సందేహం లేదు. సకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా ఇటీవలే షూటింగ్‌ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. దేవిశ్రీ ప్రసాద్‌ ఈ సినిమాకి మ్యూజిక్‌ అందించారు. మార్చిలో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మైత్రీ మూవీస్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. బుల్లితెర బ్యూటీ అనసూయ భరద్వాజ్‌ ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తుండగా, యంగ్‌ హీరో ఆది పినిశెట్టి, మరో ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు.

You May Like This
- Advertisment -spot_img

Most Popular