HomeMovie News Teluguఛలో బ్యూటీ 'రష్మిక' పై కన్నేసిన యంగ్‌ టైగర్‌

ఛలో బ్యూటీ ‘రష్మిక’ పై కన్నేసిన యంగ్‌ టైగర్‌

కన్నడలో ‘కిరిక్‌ పార్టీ’ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న ముద్దుగుమ్మ రష్మికా మండన్నా. ఆ సినిమాలో ఈ బ్యూటీ నటనకు అంతా ఫిదా అయిపోయారు. కన్నడ నుండీ ఆమె పేరు టాలీవుడ్‌ దాకా మార్మోగిపోయింది. దాంతో టాలీవుడ్‌ నుండీ వరుస అవకాశాలు క్యూ కట్టాయి. ప్రస్తుతం ఈ బ్యూటీ యంగ్‌ హీరో నాగశౌర్యతో ‘ఛలో’ సినిమాలో నటించింది. ఇదే ఈ ముద్దుగుమ్మకి తెలుగులో తొలి సినిమా. 

పోజిటివ్‌ టాక్‌తో సినిమా రన్‌ అవుతోంది. అంతేకాదు అమ్మడు తెలుగులోనూ తన టాలెంట్‌తో ఆకట్టుకుంటోంది. ఇంకేముంది ఈ సినిమా సక్సెస్‌ అయ్యిందంటే, అంతే మరి. అందం ఉంది. అభినయం సంగతి చెప్పనక్కర్లేదు. ఆల్రెడీ తొలి సినిమా విడుదలకు ముందే తెలుగులో మార్కులేయించేసుకుంది. ఇంక అంతకన్నా కావాల్సిందేముంది. అందుకే ఈ ముద్దుగుమ్మ పేరు ఇప్పుడు స్టార్‌ హీరోల లిస్టులోకి చేరిపోయిందా.. అంటే నిజమే అంటున్నాయి టాలీవుడ్‌ వర్గాలు. 

ముఖ్యంగా యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ సినిమాలో ఈ బ్యూటీ ఛాన్స్‌ దక్కించుకుందంటూ గాసిప్స్‌ వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే అమ్మడు జాక్‌ పాట్‌ కొట్టేసినట్లే. రెండో సినిమాకే స్టార్‌ హీరోతో నటించే ఛాన్స్‌ అందుకున్నట్లే. అసలు ‘కిరిక్‌ పార్టీ’ విజయం తర్వాత ఈ ముద్దుగుమ్మ పేరు టాలీవుడ్‌లో వినిపించిందే స్టార్‌ హీరోస్‌తోనే అమ్మడి ఎంట్రీ ఉండబోతోందంటూ. అల్లు అర్జున్‌ తదితర స్టార్‌ హీరోలతో రష్మికా నటిస్తోందంటూ ఆప్పట్లో గాసిప్స్‌ హల్‌చల్‌ చేశాయి. అయితే తర్వాత అవన్నీ నిజాలు కావని తేలిపోయింది. 

ఇప్పుడు ‘ఛలో’తో అమ్మడి తెరంగేట్రం జరిగింది.ఈ సినిమాలో రష్మికా టాలెంట్‌ చూశాక ఏమో అప్పటి గాసిప్స్‌ ఇప్పుడు నిజమైనా కావచ్చు. ఏం చెప్పగలం..? అయితే కొంచెం వెయిట్‌ చేయాలంతే!

You May Like This
- Advertisment -spot_img

Most Popular