HomeMovie News Teluguడేరింగ్‌ అండ్‌ డాషింగ్‌ బ్యూటీ

డేరింగ్‌ అండ్‌ డాషింగ్‌ బ్యూటీ

రష్మిక మండన్న పేరు తొలిసారిగా హైలైట్‌ అయ్యింది ‘కిరిక్‌ పార్టీ’ సినిమాతో. కన్నడలో సంచలన విజయాన్ని అందుకుంది ఈ సినిమా. అంతే, ఆ తర్వాత ఆమె గురించి తెలుగు సినీ పరిశ్రమలోనూ చర్చ జరిగింది. ఎన్టీఆర్‌ హీరోగా నటించిన ‘జై లవ కుశ’ సినిమా కోసం రష్మిక మండన్న పేరుని పరిశీలించారట. ప్రభాస్‌ ‘సాహో’ కోసం, అల్లు అర్జున్‌ ‘నా పేరు శివ’ సినిమా కోసం కూడా ఆమె పేరు చర్చల్లోకి వచ్చింది.

అయితే ‘కిరిక్‌ పార్టీ’ టైమ్‌లోనే ఆ సినిమా హీరో రక్షిత్‌ రెడ్డితో ప్రేమలో పడింది. ఆ ప్రేమ మరింత బలపడి, ఇద్దరూ పెళ్ళి చేసుకుందామనుకున్నారు. పెళ్ళయ్యాక సినిమాల్లో నటించకూడదన్న ఉద్దేశ్యంతోనే తనకు వచ్చిన ఆఫర్లని కూడా ఆమె వదిలేసుకుంది. కానీ వస్తున్న ఆఫర్ల నేపథ్యంలో రష్మికని సినిమాల్లో కొనసాగాల్సిందిగా ఆమె బాయ్‌ఫ్రెండ్‌ రక్షిత్‌ శెట్టి కోరాడట. అలా ఆమె మళ్ళీ సినిమాల్ని ఒప్పుకోవడం ప్రారంభించింది. త్వరలో తెలుగు ప్రేక్షకుల ముందుకు నాగశౌర్య హీరోగా నటించిన ‘ఛలో’ సినిమాతో రానుంది రష్మిక. 

ఇదొక్కటే కాదు, రష్మిక చేతిలో ఇంట్రెస్టింగ్‌ ప్రాజెక్ట్స్‌ తెలుగులోనే చాలా ఉన్నాయి. త్వరలో రక్షిత్‌ శెట్టిని పెళ్ళి చేసుకోబోతున్నానంటూ ‘ఛలో’ ప్రమోషన్స్‌లో భాగంగా ఇస్తోన్న ఇంటర్వ్యూల్లో డేరింగ్‌గా చెప్పేస్తోంది రష్మిక. మామూలుగా హీరోయిన్లు పెళ్ళి గురించి మాట్లాడితే, అవకాశాలు తగ్గిపోతాయి. కానీ అలాంటి భయం రష్మికలో లేదు. ఎందుకంటే రష్మిక, తన బాయ్‌ఫ్రెండ్‌ రక్షిత్‌ శెట్టిని పెళ్ళి చేసుకోబోతోందని తెలిసీ ఆమెకు అవకాశాలు వెల్లువలా వచ్చిపడ్తున్నాయి. అదే ఆమె డేరింగ్‌కి కారణం. ఆ స్మైల్‌, ఆ యాటిట్యూడ్‌, ఆ బాడీ లాంగ్వేజ్‌ రష్మికని వెరీ వెరీ స్పెషల్‌ హీరోయిన్‌గా మార్చేస్తున్నాయి.

You May Like This
- Advertisment -spot_img

Most Popular