HomeMovie News Teluguహాట్‌ హాటెస్ట్‌ జాన్వీ కపూర్‌

హాట్‌ హాటెస్ట్‌ జాన్వీ కపూర్‌

వెండితెరపై అందాల ప్రదర్శన విషయంలో ‘అతిలోక సుందరి’ కుమార్తె జాన్వీ కపూర్‌ అభిప్రాయం ఏంటో తెలుసా? ‘సినిమా అంటేనే గ్లామర్‌ కాబట్టి, గ్లామరస్‌గా కన్పించడం తప్పు కాదు’ అని. స్వయంగా ఆమే ఈ విషయాన్ని వెల్లడించింది. హద్దులు దాటని అందాల ప్రదర్శనకి తాను వ్యతిరేకం కాదని జాన్వీ చెప్పింది. 

తల్లి శ్రీదేవి కూడా చాలా సినిమాల్లో హాట్‌ హాట్‌గా కన్పించింది. కాబట్టి జాన్వీ నుంచీ ఆ స్థాయి, అంతకు మించిన స్థాయి ఎక్స్‌పోజింగ్‌ని ఆశించడం తప్పు కాకపోవచ్చు. ఇప్పుడు హీరోయిన్ల ట్రెండ్‌ బాగా మారిపోయింది. బికినీ చాలా చిన్న విషయమైపోయింది. టాప్‌లెస్‌ ఫొటోలు, అడల్ట్‌ రేటెడ్‌ అనదగ్గ సినిమాలూ వచ్చేస్తున్నాయి. ఈ ట్రెండ్‌లో జాన్వీ నిలదొక్కుకోవాలంటే అన్నీ చేయాలి. అయితే అవన్నీ జాన్వీ చేస్తుందా? అనే ప్రశ్నకు ఆమె సమాధానం ఇంట్రెస్టింగ్‌గా వచ్చింది. 

ముందు నటిగా నిరూపించుకోవాల్సి ఉందనీ, ఈ క్రమంలో బికినీ సీన్స్‌లోనూ నటించక తప్పకపోవచ్చనీ అదేమీ తప్పు కాదనీ జాన్వీ అభిప్రాయపడింది. కెరీర్‌ బిగినింగ్‌లో శ్రీదేవి కూతురన్న ఇమేజ్‌ ఉపయోగపడ్తుందని, ఆ తర్వాత తన సొంత కష్టమ్మీద అవకాశాలు సాధించుకోవాల్సి ఉంటుందని జాన్వీ చెప్పింది. సినీ బ్యాక్‌గ్రౌండ్‌ ఉన్న చాలామంది బాలీవుడ్‌లో సత్తా చాటినప్పటికీ, కొందరికి కాలం కలిసి రాలేదనీ, ఇక్కడ ఎంత కష్టపడితే రిజల్ట్‌ అంత బాగా ఉంటుందనీ మహా ముదురు తరహాలో జాన్వీ సినిమా కెరీర్‌ గురించి ఖచ్చితమైన అభిప్రాయాల్ని వెల్లడించేస్తోంది. 

స్వతహాగా కొంచెం బొద్దుతనం జాన్వీ సొంతం. అందుకే శ్రీదేవి దగ్గరుండి మరీ జాన్వీని రెగ్యులర్‌గా జిమ్‌కి పంపిస్తూ, ఫిజిక్‌ ఫిట్‌గా ఉండేలా శ్రద్ధ దీసుకుంటోందట. ఆ ఒక్క విషయంలోనే తనకు కొంచెం బద్దకమని జాన్వీ అంటోంది. ‘ధడక్‌’ సినిమాలో నటిస్తోన్న జాన్వీ ఆ తర్వాత చేయబోయే సినిమా మన తెలుగు ‘టెంపర్‌’ హిందీ రీమేక్‌లో అనే టాక్‌ వినవస్తోంది.

You May Like This
- Advertisment -spot_img

Most Popular